పవన్ దిష్టి వ్యాఖ్యల వివాదం వేళ మరో సంచలనం..!!

డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. కోనసీమ పర్యటన వేళ పవన్ చేసిన వ్యాఖ్యల పై తెలంగాణ నేతలు సీరియస్ అయ్యారు. పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ సినిమాలను తెలంగాణలో ఆడవని హెచ్చరిస్తున్నారు. కాగా, పవన్ వ్యాఖ్యల పై వివాదం వేళ జనసేన స్పందించింది. వ్యాఖ్యలకు వక్రీకరించవద్దని కోరింది. తాజాగా సీపీఐ జాతీయ నేత నారాయణ ఇదే అంశం పై స్పందించారు. సంచలన డిమాండ్ చేసారు.

డిప్యూటీ సీఎం పవన్ కోనసీమ పర్యటన వేళ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందని వ్యాఖ్యానించారనే ప్రచారం సాగింది. రాష్ట్ర విభజన అంశాన్ని పవన్ ప్రస్తావించటం పైన తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు.. పీసీసీ చీఫ్ లు.. ఎమ్మెల్యేలు సైతం పవన్ లక్ష్యంగా సీరియస్ కామెంట్స్ చేసారు. మంత్రి కోమటిరెడ్డి సైతం ఘాటుగా స్పందించారు.

CPI Narayana Demands Dy chief minister Pawan kalyan should be removed from cabinet

పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు తెలియదని అన్నారు. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ లు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెబితే తెలంగాణలో ఆయన సినిమా ఒకటి, రెండు రోజులు ఆడుతుందన్నారు. లేకుంటే సినిమాలు ఆడవని కోమటిరెడ్డి హెచ్చరించారు. దీంతో, జనసేన స్పందించింది. పవన్ వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చింది.

రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు.. అని జనసేన పార్టీ వివరణలో భాగంగా స్పష్టం చేసింది. కాగా, సీపీఐ కీలక నేత నారాయణ సంచలన డిమాండ్ చేసారు. డిప్యూటీ సీఎం పవన్ ను కేబినెట్ నుంచి తప్పించాలని కోరారు. పవన్ శైలితో తెలుగు ప్రజల ఐక్యత దెబ్బ తినే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

CPI Narayana Demands Dy chief minister Pawan kalyan should be removed from cabinet

తెలుగు రాష్ట్రాలు బౌగోళికంగా విభజన జరిగింది కానీ, శత్రుత్వం లేదని చెప్పుకొచ్చారు. పవన్ మొదట్లో చెగువేరా అన్నారని.. ఇప్పుడు సావర్కర్ శిష్యుడిగా మారారని ఎద్దేవా చేసారు. సనాతన ధర్మం పేరుతో తిరుగుతున్నారని పేర్కొన్న నారాయణ దిష్టి పేరుతో మాట్లాడుతున్నారని పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ సనాతన ధర్మం పేరుతో తిరగవచ్చని.. అయితే, డిప్యూటీ సీఎంగా ఉంటూ కుదరదని నారాయణ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+