• search
 • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దాచేపల్లి రేప్ ఇష్యూ: చెట్టుకు ఉరేసుకున్న నిందితుడు సుబ్బయ్య

By Srinivas
|
  దాచేపల్లి ఘటనలో నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య

  దాచేపల్లి: గుంటూరు జిల్లా దాచేపల్లి బాలిక అత్యాచార ఘటన నిందితుడు సుబ్బయ్య ఉరేసుకొని చనిపోయాడు. అత్యాచార ఘటన అనంతరం తాను చనిపోతున్నానని అతను కొందరికి సమాచారం ఇచ్చాడు. అతను కృష్ణా నది వైపు పరుగు పెట్టాడు. దీంతో అతను కృష్ణా నదిలో దూకి చనిపోయి ఉంటాడని భావించారు.

  చదవండి: పదిమందికి మంచి చెప్పే నేను, చేయకూడని పని చేశా: ఆత్మహత్యకు ముందు దాచేపల్లి నిందితుడు

  దీంతో గురువారం నుంచి అతని కోసం కృష్ణా నదిలో వెతకడం ప్రారంభించారు. ఆ చుట్టుపక్కల కూడా వెతికారు. అయితే, శుక్రవారం ఉదయం దైద సమీపంలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. అతనిని సుబ్బయ్యగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

  దాచేపల్లి ఇష్యూ.. బాబు రాజీనామా చేయాలి: రోజా బైఠాయింపు, పోలీసులతో వాగ్వాదందాచేపల్లి ఇష్యూ.. బాబు రాజీనామా చేయాలి: రోజా బైఠాయింపు, పోలీసులతో వాగ్వాదం

  17 బృందాలతో గాలింపు

  17 బృందాలతో గాలింపు

  అంతకుముందు, నిందితుడి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలించారు. 17 బృందాలతో అతని కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. కృష్ణా నది ఒడ్డున డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు దాచేపల్లిలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఎస్పీ పర్యవేక్షణలో నిఘా ఏర్పాట్లు ఉంచారు.

  నా బిడ్డ కష్టం ఏ బిడ్డకూ రావొద్దు

  నా బిడ్డ కష్టం ఏ బిడ్డకూ రావొద్దు

  అత్యాచారానికి గురైన బాలిక తల్లి మాట్లాడుతూ.. ఏ బిడ్డకు ఇలాంటి కష్టం రాకూడదన్నారు. నా బిడ్డ మనోవేధన చూడలేకపోతున్నానని వ్యాఖ్ానించారు. నిందితుడిని మాకు అప్పగిస్తే మరోసారి ఇలాంటివి జరగకుండా శిక్ష వేస్తామన్నారు.

  ఆసుపత్రిలో బాలికకు చికిత్స

  ఆసుపత్రిలో బాలికకు చికిత్స

  మరోవైపు, దాచేపల్లిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు రోజా సహా పలువురు నేతలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. రోజాను మహిళా ఎమ్మెల్యేలు ఈడ్చుకెళ్లారు. అంతకుముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను రోజా పరామర్శించారు.

  రోజా ఆగ్రహం

  రోజా ఆగ్రహం

  ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు రోజా. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాలికకు నాలుగు కుట్లు పడ్డాయని, తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతోందన్నారు. మగాళ్లు అంటేనే ఆ అమ్మాయి భయపడిపోతోందని తెలిపారు. ఆసుపత్రిలోని గదిలోకి హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చినా భయంతో హడలిపోతోందన్నారు. ఒక ముసలివాడు అమ్మాయిని గంటసేపు రేప్ చేసి పోతుంటే మన పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.

  సుబ్బయ్య ఫ్యామిలీ వైసీపీ సానుభూతిపరులు!

  సుబ్బయ్య ఫ్యామిలీ వైసీపీ సానుభూతిపరులు!

  ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. నిందితుడు సుబ్బయ్య సోదరుడి కుమారుడు గురజాల వైసీపీ నాయకుడు అని, వైసీపీ ఫ్లెక్సీలోను సుబ్బయ్య కుటుంబ సభ్యుల ఫోటోలు ఉన్నాయన్నారు.

  English summary
  The rape of a nine year old child allegedly by a 60 year old man in Andhra Pradesh triggered massive protests in a village in Guntur district. Accused hanged himself.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X