వైఎస్ జగన్ సొంత ఊళ్లోనే దారుణం .. దళితమహిళ హత్యాచారం : లోకేష్ , దివ్యవాణి, దేవినేని ఉమా ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడుతున్నారు. ఏపీ సీఎం వైయస్ జగన్ సొంత గ్రామంలోనే దళిత మహిళ నాగమ్మ అత్యాచారానికి గురైందని, ఈ ఘటనపై విచారణ జరిపించి నాగమణి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

చట్టాల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప మృగాలను శిక్షించింది లేదు: లోకేష్
పులివెందుల నియోజకవర్గం పెద్ద కుడాల గ్రామం లో దళిత మహిళ నాగమ్మను అత్యాచారం చేసి హత్య చేశారని, ఈ విషయం బయటకు రాకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సంచలన విషయాలు బయట పెట్టారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసిన నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప మృగాలను శిక్షించింది లేదు అంటూ మండిపడ్డారు.

వైయస్ జగన్ సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కరువైందని లోకేష్ ఆగ్రహం
వైయస్ జగన్ సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కరువైందని నాగమ్మ మృతదేహాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహిళలపై రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నాగమ్మ అత్యాచార ఘటనను బయటకు రాకుండా జాగ్రత్త పడుతుందన్నారు. ఈ విషయం బయటకు రాకుండా చేయడంపై పెడుతున్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి అత్యంత కిరాతకంగా నాగమ్మ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

హత్యాచార ఘటనపై దివ్యవాణి ఆవేదన .. సీఎం సొంత ఊళ్ళేనే ఇలా ఉంటే ఎలా ?
మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ ప్రతినిధి దివ్య వాణి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న ప్రభుత్వంలో చలనం లేదని మండిపడిన దివ్యవాణి ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన బయటకు రాకుండా దాచాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు .

రాష్ట్రంలో ఇలాంటి ఘటనలతో మహిళలలో ఆందోళన
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న దివ్యవాణి, నాగమ్మ హత్యాచార ఘటనపై భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ ఇలాంటి విషయాలపై కుట్రలు చేయకుండా, విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చేయాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. జగన్ సొంత గ్రామంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు దివ్యవాణి. ఇలాంటి ఘటనలతో రాష్ట్రంలో మహిళలు ఎలా ప్రశాంతంగా ఉంటారని ప్రశ్నించారు .
Recommended Video

వైసీపీ హయాంలో హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి : దేవినేని ఉమా
పులివెందుల నియోజకవర్గం, పెద్ద కుడాల గ్రామంలో నాగమ్మ అనే మహిళపై జరిగిన హత్యాచార ఘటనపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయని , అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ దేవినేని ఉమా అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో చలనం లేనట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నాగమ్మ హత్యాచార ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన దేవినేని ఉమా, ఈ ఘటనపై విచారణ జరిపించి ఆ కిరాతకులకు శిక్షపడేలా చూడాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications