జనసేనలోకి ఇద్దరు మాజీ మంత్రులు, ఓ సిట్టింగ్ ఎంపీ- చేరికలకు ముహుర్తాలు ఫిక్స్?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల్లో చేరికలు, మార్పులు చేర్పుల పర్వం కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీలన్న తేడా లేకుండా ఈ మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం కోసం టీడీపీతో జత కట్టిన జనసేన పార్టీలోకి కీలక నేతల చేరికలు ఊపందుకోనున్నాయి. గతంలో పవన్, నాదెండ్ల మినహా సీనియర్లు ఎవరూ కనిపించని జనసేన పార్టీలో తాజా చేరికలు కీలకంగా మారబోతున్నాయి.
జనసేన పార్టీలో చేరే నేతల్లో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇప్పుడు ముందున్నారు. ఇప్పటికే పవన్ ను కలవడంతో పాటు స్వయంగా అనుచరులతో భేటీ ఏర్పాటు చేసి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించిన కొణతాల రామకృష్ణ.. ఈ నెల 27న ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అనంతరం కొణతాలకు అనకాపల్లి ఎంపీ టికెట్ కేటాయించవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు హామీ లభించాకే ఆయన జనసేన గూటికి చేరుతున్నారు.

జనసేన పార్టీలో చేరే నేతల్లో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు కాపు నేత ముద్రగడ పద్మనాభం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు కాపు ప్రభావిత నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్న ముద్రగడను జనసేనలోకి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి.

ఇందులో చివరిగా పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన్ను కలవడం ఒక్కటే మిగిలుంది. ఇది పూర్తి కాగానే ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు గిరిబాబుతో కలిసి ఈ నెల 30న జనసేనలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అనంతరం ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారు.

అలాగే వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన కూడా పవన్ కళ్యాణ్ ను కలిసి చర్చలు జరిపారు. ఇందులో మచిలీపట్నం ఎంపీ టికెట్ కేటాయించేందుకు పవన్ సై అనడంతో బాలశౌరి ఫిబ్రవరి 2న పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.ఈ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించేందుకు బాలశౌరి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications