Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టెక్కీ మృతి: భార్యకు అరగంట 'బర్త్ డే' ఫోన్, హత్యనా?

Suicide
హైదరాబాద్: రెండు రోజుల క్రితం ఘట్‌కేసర్ సమీపంలోని సంస్కృతి టౌన్‌షిప్ పై అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్టువేర్ ఇంజనీర్ దీపక్ హబీబ్ ఘటనకు ముందు తన భార్యతో ఫోన్లో అరగంటకు పైగా ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం దీపక్ తన రెండు చేతుల మణికట్టును కోసుకొని, ఆ తర్వాత పై అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. అదే రోజు దీపక్ సతీమణి పుట్టిన రోజు. దీపక్ సతీమణి, ఇతర కుటుంబ సభ్యులు హూబ్లీలో ఉన్నారు. వారు పుట్టిన రోజు వేడుకల ఆనందంలో ఉన్నారు. అదే రోజు దీపక్ భార్యతో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు దీపక్ భార్య వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు.

దీపక్ తన భార్య, కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడారో తెలియదని, కుటుంబ సభ్యులను ప్రశ్నించాల్సి ఉందని దర్యాఫ్తు అధికారులు చెబుతున్నారు. దీపక్ ఆత్మహత్య వెనుక కుటుంబ సమస్యలు లేదా ప్రొఫెషన్ సమస్యలు ఉన్నాయా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం చేసిన వైద్యులు మాత్రం చేతికి అయిన గాయాలు దీపక్ చేసుకున్నట్లుగా తేలిందని చెబుతున్నారని అయితే, పూర్తి నివేదిక వచ్చే వరకు ఆగాల్సి ఉంటుందన్నారు.

దీపక్ తన రెండు చేతులకు గాయాలు చేసుకున్న అనంతరం పై అంతస్థు నుండి దూకాడు. ఏడమ చేతి వైపుకు చేసుకున్న గాయం బలంగా, కుడిచేతి గాయం తక్కువగా ఉంది. విచారణలో భాగంగా దీపక్ కుటుంబ సభ్యులు వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయనున్నారు. బంధువులు దీపక్‌ది హత్యగా కూడా అనుమానిస్తున్నారని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ ఉద్యోగులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+