Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫిరాయింపు నేతలు పనికిమాలినోళ్ళన్న వర్ల .. నిలకడ లేనోళ్ళన్న అశోక్ గజపతి రాజు

తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు టీడీపీ రాజ్య సభ ఎంపీలు బీజేపీలో చేరారు . చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారు . ఇక పార్టీ మారిన టీడీపీ రాజ్యసభ సభ్యులపై టీడీపీ నేతల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది . కేవలం స్వార్ధ ప్రయోజనాల కోసమే టీడీపీని వీడి వెళ్ళటం హేయమైన చర్యని , పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా చెయ్యటం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఫిరాయింపు నేతలపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు .

ఫిరాయింపు నేతలపై వర్ల రామయ్య ఫైర్.. పనికిమాలినోళ్ళని తీవ్ర వ్యాఖ్యలు

ఫిరాయింపు నేతలపై వర్ల రామయ్య ఫైర్.. పనికిమాలినోళ్ళని తీవ్ర వ్యాఖ్యలు

ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలపై టీడీపీ నేత వర్ల రామయ్య చాలా ఘాటుగా స్పందించారు. పనికిమాలిన నలుగురు ఎంపీలు పార్టీని వీడినంత మాత్రాన టీడీపీకీ వచ్చిన నష్టం ఏమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం కేసుల నుండి తప్పించుకోటానికే ఇలా బీజేపీలో చేరారని ఆరోపించారు. ఎక్కడ కేసుల్లో అరెస్ట్ చేస్తారో అన్న భయంతో అండర్ గ్రౌండ్‌కు వెళ్లిన సుజనాచౌదరిని బీజేపీ నేతలు ఎలా తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు . సుజనాకు ఏం క్లీన్‌చిట్ ఉందని బీజేపీలోకి తీసుకున్నారో తెలియట్లేదని పేర్కొన్నారు . ఇక చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద పదవులు పొందిన నేతలు ఇలా వెన్నుపోటు పొడవటం వారి నైతికత అని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా వారు ప్రజల్లోంచి వచ్చిన రాజకీయ నేతలు కాదన్నారు. వారంతా స్వప్రయోజనాల కోసమే పార్టీ మారారని ఆయన అభిప్రాయపడ్డారు.

 రాజకీయాల్లో నిలకడ అవసరం అని పార్టీ మారినోళ్ళు నిలకడలేనోళ్ళు అన్న అశోక్ గజపతి రాజు

రాజకీయాల్లో నిలకడ అవసరం అని పార్టీ మారినోళ్ళు నిలకడలేనోళ్ళు అన్న అశోక్ గజపతి రాజు

ఇక రాజకీయాల్లో నిలకడ ఉండాలని మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు అభిప్రాయపడ్డారు. పార్టీ మారిన టీడీపీ ఎంపీలు నిలకదలేనూలని ఆయన అన్నారు . టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంపై స్పందించిన ఆయన టీడీపీకి కార్యకర్తల బలం ఉందని చెప్పారు. కార్యకర్తల నుండి నాయకులు తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. అలా కార్యకర్తల నుండి నాయకులను తయారుచేసిన చరిత్ర టీడీపీకి ఉందని చెప్పారు. కొత్త నాయకత్వం రావాల్సి ఉందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఏపీలో జగన్ నెల రోజుల పాలనపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆశోక్ గజపతి రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు .

ఓటమిపాలైతే పార్టీ మూసెయ్యలా అని మండిపడిన కనకమేడల

ఓటమిపాలైతే పార్టీ మూసెయ్యలా అని మండిపడిన కనకమేడల

తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, బాబు ప్లాన్‌లో భాగంగానే ఎంపీలను బీజేపీలోకి పంపుతున్నారన్న వ్యాఖ్యలను కనకమేడల రవీంద్రకుమార్ ఖండించారు.37 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 5 సార్లు గెలిచి 4 సార్లు ఓడిపోయామన్నారు. ఓడిపోయిన పార్టీలు అంతరించిపోవాలా అని ఇదేనా మోడీ ఆలోచన అని కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగలేదని.. తమను ఎవరు సమావేశానికి పిలవలేదని, చట్ట ప్రకారం ఎంపీల విలీనం జరగలేదన్నారు. అది విలీనం కాదని.. ఫిరాయింపు కిందకు వస్తుందని కనకమేడల తెలిపారు. ఇక ఓడిపోయినప్పుడు పార్టీని మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ మూసేయలేదని పేర్కొన్నారు . పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కనకమేడల తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+