YS Jagan: డైహార్డ్ ఫ్యాన్: డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి టిక్ టాక్ వీడియో: రాయలసీమ ముద్దుబిడ్డ అంటూ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైహార్డ్ ఫ్యాన్స్ లల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఉప ముఖ్యమంత్రి పుష్పా శ్రీవాణి. రాజకీయాల్లో చేరక ముందు నుంచీ ఆమెకు వైఎస్ జగన్ అంటే అభిమానమే. అందుకే- తన కుడి చేతిపై వైఎస్ జగన్ పేరును పచ్చబొట్టుగా వేసుకున్నారు. తాజాగా- మరో అడుగు ముందుకేశారు. వైఎస్ జగన్ పై తన అభిమానాన్ని చాటుతూ ఓ టిక్ టాక్ వీడియోను రూపొందించారు.
ప్రముఖ గాయని మంగ్లి ఇదివరకు పాడిన పాట ఆధారంగా టిక్ టాక్ వీడియోను చేశారు. రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న.. అనే పాటకు పుష్పా శ్రీవాణి చక్కటి హావభాావాలను పలికించారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా మంగ్లి పాడిన పాట అది. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తోన్న సమయంలో ఆయనపై ఓ ఆల్బమ్ ను రూపొందించారు. అందులో నుంచి ఈ పాటను తీసుకుని, టిక్ టాక్ వీడియోను చేశారు.

16 సెకెన్ల పాటు నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ అవుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పుష్పా శ్రీవాణి విజయం సాధించిన పుష్పా శ్రీవాణి.. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. వైఎస్ జగన్ కేబినెట్ లో ఆమె గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు.
డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి టిక్ టాక్ వీడియో: రాయలసీమ ముద్దుబిడ్డ అంటూ.. !#ysjaganmohanreddy #YSRCP #TikTok #PushpaSrivani pic.twitter.com/WG6Xn8zvZ7
— Oneindia Telugu (@oneindiatelugu) January 1, 2020












Click it and Unblock the Notifications