ద్వారంపూడికి దిమ్మతిరిగే షాకిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!!
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు జనసేన మంత్రులు చెక్ పెట్టే పనిలో ఉన్నారా? ద్వారంపూడి దందాలను ఒక్కొక్కటిగా బయటకు తెస్తున్నారా? ఇప్పటికే ద్వారంపూడిపై ఏవన్ గా ఒక కేసు నమోదైన వేళ మరింత లోతుగా ద్వారంపూడి వ్యాపారాలు, వ్యవహారాలు దర్యాప్తు చేస్తున్నారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
ద్వారంపూడికి దడ పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్
ఏపీ ప్రభుత్వం వేస్తున్న అడుగులు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ద్వారంపూడికి దడ పుట్టిస్తున్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, గతంలో టిడిపి జనసేన నేతలు ఏక కంఠంతో ఆయనపైన విరుచుకుపడ్డారు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పాపాల చిట్టా బయట పెడతామంటూ సవాల్ విసిరారు.

బియ్యం మాఫియా .. లోతుగా ఆరా
ఇక మొన్న ఎన్నికల్లో ఏపీలో వైసిపి నుండి పోటీ చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓటమి పాలు కావడంతో ఒక్కొక్కటిగా ద్వారంపూడి వ్యవహారాల పైన ఫోకస్ చేశారు. ద్వారంపూడి కుటుంబం రేషన్ దందా చేస్తుందని ఆరోపిస్తున్న జనసేన మంత్రులు ద్వారంపూడి కుటుంబం లక్షల టన్నుల రేషన్ బియ్యం ఎగుమతుల పైన లోతుగా ఆరా తీస్తున్నారు. కేసును సిఐడి కి అప్పగిస్తామని ఇప్పటికే మంత్రి నాదెండ్ల ప్రకటించడంతో ద్వారంపూడికి టెన్షన్ మొదలైంది.
ద్వారంపూడి ఫ్యాక్టరీలపై పవన్ కీలక ఆదేశాలు
ఇది ఇలా ఉంటే తాజాగా ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని గుర్తించారు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఆయన ఫ్యాక్టరీల పైన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. వైసిపి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్ సంస్థ శుద్ధి చేయని వ్యర్ధాలను పంట కాలవల్లోకి విడుదల చేయడం పైన విచారణకు ఆదేశించారు.
ద్వారంపూడి సంస్థకు నోటీసులు
రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పర్యావరణ ఉల్లంఘనల పైన సమగ్ర విచారణ జరపాలని పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థకు నోటీసులు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ ఉల్లంఘనల పైన సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లోగా ఆ సంస్థకు నోటీసులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.
ద్వారంపూడి ఉక్కిరిబిక్కిరి
దీంతో ద్వారంపూడి మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లు అయింది. ద్వారంపూడి చేస్తున్న అన్ని వ్యాపారాల పైన జనసేన మంత్రులు ఫోకస్ పెట్టడంతో ఆయన చాప్టర్ క్లోజ్ అని కాకినాడలో చర్చ జరుగుతుంది. ద్వారంపూడికి చెందిన అన్ని వ్యవహారాలపై నిఘా పెట్టిన వేళ ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.












Click it and Unblock the Notifications