వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎఫెక్ట్: ఆ ఒక్క విషయంతో అఖిలప్రియపై ఇరకాటంలో చంద్రబాబు, లోకేష్ క్లారిటీ ఇచ్చినా

పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా విరుచుకుపడటం చర్చనీయాంశమైంది. తోటి మంత్రులు, టీడీపీలో, విపక్షంలో అఖిలప్రియ తీరుపై చర్చ సాగుతోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా విరుచుకుపడటం చర్చనీయాంశమైంది. తోటి మంత్రులు, టీడీపీలో, విపక్షంలో అఖిలప్రియ తీరుపై చర్చ సాగుతోంది.

చదవండి: మీదే బాధ్యత! వాళ్లైతే రాజీనామా చేసేవాళ్లు, ఇది కూడా చూసుకోలేరా: అఖిలపై బాబు సంచలనం

సోమవారం జరిగిన మంత్రులు, అధికారుల భేటీలో చంద్రబాబు బోటు ప్రమాదం అంశంపై అఖిలప్రియ, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత వహించాలని, గతంలో అయితే రాజీనామా చేసేవారని అఖిలను ఉద్దేశించి సీరియస్ అయ్యారు. చంద్రబాబు అంత సీరియస్ కావడం చర్చకు దారి తీసింది.

లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు కానీ

లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు కానీ

దీంతో చిన్న వయస్సులోనే మంత్రి అయిన అఖిలప్రియ, తక్కువ కాలం మంత్రిగా కూడా అవుతారా అనే చర్చ సాగింది. ఆమెను చంద్రబాబు తప్పిస్తారా లేక ఆమె రాజీనామా చేస్తారా అనే వాదనలు వినిపించాయి. కానీ మంత్రి నారా లోకేష్ అంతా కొట్టిపారేశారు. అఖిల పనితీరుపై లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు, కేబినెట్ విస్తరణా లేదని, అఖిలప్రియను తప్పించేది లేదని అభిప్రాయపడ్డారు.

అఖిలకు ఊరట, కానీ ఘాటు వ్యాఖ్యల వెనుక

అఖిలకు ఊరట, కానీ ఘాటు వ్యాఖ్యల వెనుక

నారా లోకేష్ వ్యాఖ్యలు అఖిలప్రియకు, ఆమె వర్గానికి ఊరటను ఇచ్చేవే. కానీ గత కొంతకాలంగా ఆమె పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది వాస్తవం అంటున్నారు. గతంలో అయితే రాజీనామా చేసేవారు అని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారంటే ఆమె పని తీరుపై ఎంత అసంతృప్తితో ఉన్నారనేది అర్థమవుతోందని అంటున్నారు.

పెండింగులో ఫైళ్లు, తన వారి పనులపై ఆసక్తి

పెండింగులో ఫైళ్లు, తన వారి పనులపై ఆసక్తి

మంత్రి అయిన కొత్తలో పని చేశారు. ఆ తర్వాత నంద్యాల ఉప ఎన్నికలు వచ్చాయి. నెలల పాటు వాటిపై దృష్టి పెట్టవలసి వచ్చింది. ఆ తర్వాత పర్యాటక శాఖలో ఫైళ్లు పెండింగులో ఉంటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, తనకు కావాల్సిన వారికి పనులు చేసేందుకే అఖిల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయని, దీంతో చంద్రబాబుకు ఆగ్రహిస్తున్నారని అంటున్నారు.

అఖిలప్రియ తీరు చూశాకే బాబు ఆగ్రహం

అఖిలప్రియ తీరు చూశాకే బాబు ఆగ్రహం

అఖిలప్రియపై చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నారని చెబుతున్నారు. ఒకటి రెండుసార్లు ఆమె పని తీరును చూశాకే చంద్రబాబు అంత ఘాటు వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఓ సమయంలో అఖిలప్రియను తప్పించి మరొకరికి అవకాశమిద్దామని కూడా చంద్రబాబు భావించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

యనమలతో పాటు అఖిలప్రియకు చెక్ చెప్పాలని

యనమలతో పాటు అఖిలప్రియకు చెక్ చెప్పాలని

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని రాజ్యసభకు పంపిస్తామని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన స్థానంతో పాటు అఖిలను కూడా తప్పించి మరొకరికి బాధ్యత అప్పగించాలని చంద్రబాబు భావించారని అంటున్నారు. అఖిలప్రియ ఎంత వేగంగా పాపులర్ అయ్యారో అంతే వేగంగా ప్రతిష్ట కోల్పోతున్నారని అంటున్నారు. కానీ అంతలోనే లోకేష్ విస్తరణ లేదని తేల్చేశారు. కానీ ఆమెపై బాబు మాత్రం అసంతృప్తితో ఉన్నారనేది నిజం అంటున్నారు.

ఒక్క విషయంతో ఇరుకునపడ్డ బాబు

ఒక్క విషయంతో ఇరుకునపడ్డ బాబు

అయితే, ఒక్క విషయం అఖిలప్రియపై వేటు విషయంలో టీడీపీని ఇరకాటంలో పడేసి ఉంటుందని అంటున్నారు. ఆమె వైసిపి నుంచి వచ్చి మంత్రి అయ్యారు. పనితీరుతో ఆమెను తప్పిస్తే వైసీపీకి ఓ ఆయుధం ఇచ్చినట్లవుతుందని టిడిపి నేతలు చెవులు కొరుక్కుంటున్నారని తెలుస్తోంది. అనుభవం లేని వారికి పదవి ఇచ్చారని వైసీపీ విమర్శించేందుకు ఆస్కారం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. అఖిలను తప్పిస్తే వైసిపికి, జగన్‌కు ఛాన్స్ ఇచ్చినట్లవుతుందని, అలాంటి ఛాన్స్ ఇవ్వొద్దనే ఆమెపై కొంత తగ్గి ఉంటారనే ప్రచారం కూడా సాగుతోంది.

చదవండి: విజయవాడ టూరిజం కార్యాలయంలో అఖిలప్రియ ఆకస్మిక తనిఖీలు

చదవండి: పనితీరు బాగాలేదా: బాబు 'రిజైన్' వ్యాఖ్యలతో అఖిల కలత! ఊహించని నిర్ణయం తీసుకుంటారా?

చదవండి: నంది అవార్డ్, మరో ఆసక్తికరం: జూ ఎన్టీఆర్‌ను పక్కనపెట్టిన లోకేష్! కావాలనే చేశారా?

English summary
It seems the tragic boat mishap which claimed 22 innocent lives in Vijayawada is still haunting Tourism Minister Bhuma Akhila Priya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X