ఏపీలో దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం.. వారికి ఉచితం, సహాయకులకూ బెనిఫిట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు తీపికబురు చెప్పింది. దివ్యాంగుల సంక్షేమం కోసం 'దివ్యాంగ శక్తి' పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం కింద 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో పూర్తి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, నగర సర్వీసులతో పాటు అంతర్-జిల్లా బస్సుల్లోనూ ఈ సదుపాయం వర్తిస్తుంది. నేటి నుంచి అధికారికంగా అమలు ప్రారంభమైంది.

దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం

ఈ పథకం ద్వారా దివ్యాంగులు విద్య, ఉద్యోగం, ఉపాధి, వైద్య అవసరాల కోసం రూపాయి కహ్ర్చు లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణ ఖర్చులు వారికి ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తీవ్ర వైకల్యం ఉండి ఒంటరిగా ప్రయాణించలేని వారికి తోడుగా ఉండే సహాయకుడికి కూడా 50 శాతం రాయితీ లభిస్తుంది.

Divyanga Shakti scheme AP Divyanga Shakti free rtc bus travel scheme for differently-abled persons in apsrtc

ఉచిత బస్సు సౌకర్యం పొందాలంటే దివ్యాంగులకు అర్హతలు ఇవే

అర్హత కోసం లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసితులై ఉండాలి. సదరం ధ్రువీకరణ పత్రం లేదా యూడీఐడీ కార్డులో కనీసం 40 శాతం వైకల్యం నమోదై ఉండాలి. అంధత్వం, లోకోమోటర్ వైకల్యం, వినికిడి లోపం, మానసిక వైకల్యం ఉన్నవారందరూ ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వం జారీ చేసే 'దివ్యాంగ శక్తి స్మార్ట్ బస్ పాస్' లేదా చెల్లుబాటు అయ్యే యూడీఐడీ కార్డు ఉన్నవారే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

వారి కోసం దివ్యాంగ స్మార్ట్ బస్ పాస్

స్మార్ట్ బస్ పాస్‌లో క్యూఆర్ కోడ్, ఆర్ఎఫ్ఐడీ చిప్ ఉంటాయి. కండక్టర్ వద్ద ఉండే టికెట్ యంత్రాల ద్వారా స్కాన్ చేసి జీరో-ఫేర్ టికెట్ జారీ చేస్తారు. దీని వల్ల అనర్హులు ప్రయోజనం పొందకుండా నియంత్రణ సాధ్యమవుతుంది. దరఖాస్తు చేసుకోవాలంటే గ్రామ,వార్డు సచివాలయాలు లేదా సమీప ఆర్టీసీ బస్ డిపో కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా దరఖాస్తు అవకాశం

సదరం సర్టిఫికెట్ లేదా యూడీఐడీ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు, నివాస ధ్రువపత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం. ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా దరఖాస్తు అవకాశం ఉంది. పరిశీలన తర్వాత స్మార్ట్ పాస్ ఉచితంగా అందజేస్తారు. ఈ పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని లక్షలాది దివ్యాంగుల కుటుంబాలపై నెలవారీ రవాణా భారాన్ని తగ్గిస్తుంది. విద్యార్థులు, చిరువ్యాపారులు, దీర్ఘకాలిక రోగులు సులభంగా ప్రయాణించగలుగుతారు. అర్హులైనవారు వెంటనే దరఖాస్తు చేసుకుని సదుపాయాన్ని పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+