"ఆప్షన్ కాదు .. బాధ్యతే..!" చంద్రబాబుకు జగన్ పండగ స్పెషల్..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోంది. వీటిలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాల కంటే ఇప్పుడు రాష్ట్రంలో ఓ కీలక అంశంపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. అదే డీఎస్సీ పరీక్ష. గతేడాది నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఓవైపు విపక్ష వైఎస్సార్సీపీ ఆరోపిస్తుండగా.. అబ్బే అదేం లేదంటూ అధికార కూటమి బుకాయిస్తోంది. మధ్యలో వైసీపీ తరచూ పలు ఆధారాలను బయటపెడుతున్నా ప్రభుత్వం వాటిని లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మరోసారి సీఎం చంద్రబాబును (Chandrababu) ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ పెట్టారు.

టీచర్ల నియామకాలపై తేల్చేసిన సుప్రీంకోర్టు..! ఏపీలో డీఎస్సీ వివాదం వేళ..!
టీచర్ల నియామకాలపై తేల్చేసిన సుప్రీంకోర్టు..! ఏపీలో డీఎస్సీ వివాదం వేళ..!

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే, అభ్యర్థుల కలలు కల్లలవుతాయి అంటూ జగన్ ఇవాళ ట్వీట్ చేశారు. న్యాయమైన అవకాశం కోసం లక్షలాది మంది అభ్యర్థులు తమ జీవితంలోని అత్యంత విలువైన కాలాన్ని, తమ కుటుంబాలు కష్టపడి సంపాదించిన డబ్బును వెచ్చిస్తారని, వ్యవస్థ విఫలమైనప్పుడు, అది కేవలం ఫలితాలపైనే ప్రభావం చూపదని, నియామక ప్రక్రియపై వారికున్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసి, వారిలో తీవ్ర నిరాశను నింపుతుందని జగన్ స్పష్టం చేశారు.

DSC Row YS Jagan Asks Chandrababu to Take Responsibility Says Aspirants Dreams Are at Stake
కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం అలా చేయొద్దు..! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!
కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం అలా చేయొద్దు..! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!

చంద్రబాబు గారూ, పారదర్శకత లేదా న్యాయం అనేది ఒక ఐచ్ఛికం కాదు, అది ఒక బాధ్యత అని జగన్ తెలిపారు. వారి కఠోర శ్రమకు తగిన న్యాయం, భవిష్యత్తులో జవాబుదారీతనం అవసరమని మీకు అనిపించడం లేదా? అని నిలదీశారు. డీఎస్సీలో జరిగిన ప్రస్తుత కుంభకోణానికి మీరు బాధ్యత వహిస్తారా? అని మరోసారి చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. మరోవైపు డీఎస్సీలో జరిగిన అక్రమాలపై అధికారులతో పదే పదే వివరణ ఇప్పిస్తున్న ప్రభుత్వం.. విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ తో కానీ, సీఎం చంద్రబాబుతో కానీ ఎందుకు మాట్లాడించడం లేదన్న చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+