ఈసీ బిగ్ షాక్- ఏపీలో ఆ పథకాల నిధుల విడుదలకు బ్రేక్..!
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఎన్నికల సంఘం ఇవాళ కూడా దాన్ని కొనసాగించింది. వైసీపీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెలా విడుదల చేస్తున్న సంక్షేమ పథకాల నిధుల విడుదల కోసం ఈసారి కూడా ఈసీ అనుమతి కోరింది. అయితే రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా నిధుల విడుదల కుదరదని ఈసీ తేల్చిచెప్పేసింది.

రాష్ట్రంలో ఈ నెల విడుదల చేయాల్సిన సంక్షేమ పథకాల్లో ఫీజు రీయింబర్స్ మెంట్, ఇన్ పుట్ సబ్సిడీ వంటివి ఉన్నాయి. అయితే వీటి విడుదలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీని కోరింది. ఇవి ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలే అని, వీటి వల్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగదని స్పష్టం చేసింది. అయితే ఈసీ మాత్రం పథకాల మొత్తాలను లబ్దిదారుల ఖాతాల్లోకి పంపేందుకు అనుమతి నిరాకరించింది.
రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లను ఇంటింటికీ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా ఈసీ బ్రేక్ వేసింది. దీంతో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో పాటు మిగిలిన వారికి ఇంటికి సచివాలయ సిబ్బంది ద్వారా అధికారులు పంపిణీ చేయించారు. దీనిపైనే వైసీపీ వర్సెస్ విపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ (విద్యాదీవెన), ఇన్ పుట్ సబ్సిడీ (రైతు భరోసా) మొత్తాల్ని కూడా విడుదల చేయకుండా ఈసీ అనుమతి ఇవ్వడంతో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.












Click it and Unblock the Notifications