మిథున్ రెడ్డిని అడ్డంగా బుక్ చేసేసిన సాయిరెడ్డి...! ఈడీ చెడుగుడు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిందని భావిస్తున్న మద్యం స్కాంలో కర్త, కర్మ, క్రియ ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డే అంటూ గతంలో సీఐడీ సిట్ విచారణలో చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy).. తాజాగా ఈడీ విచారణలో మరో బాంబు పేల్చారు. ఇప్పుడు ఆయనకు తోడు వైసీపీ సిట్టింగ్ ఎంపీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డిని కూడా బుక్ చేశారు.
మిథున్ రెడ్డిని బుక్ చేసిన సాయిరెడ్డి (vijayasai reddy)
తాజాగా లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి సలహా మేరకే తాను తన అల్లుడి సంస్థ అయిన అరబిందో నుంచి ఏ1 నిందితుడు రాజ్ కెసిరెడ్డికి 100 కోట్లు ఇప్పించినట్లు వెల్లడించారు. వాస్తవానికి ఈ విషయం ప్రస్తుతం ఈడీకి చెప్పాల్సిన అవసరం ఉందో లేదో తెలియదు కానీ విజయసాయిరెడ్డి మాత్రం తొలిసారి ఈ విషయం వెల్లడించారు. దీంతో ఇప్పుడు సీఐడీ దర్యాప్తులో బయటపడని ఓ అంశం ఈడీ విచారణలో బయటపడినట్లయింది.

మిథున్ రెడ్డిని అడిగిన ఈడీ
లిక్కర్ స్కాంలో వైసీపీ అగ్రనేతల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చినా ఇప్పటివరకూ కేవలం ఎంపీ మిథున్ రెడ్డి ని మాత్రమే అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం, ఆయన బెయిల్ పై బయటికి రావడం జరిగాయి. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈడీ విచారణలో చెప్పిన విషయాలతో మిథున్ రెడ్డి మరింతగా ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి విచారణ తర్వాత రోజే ఈడీ విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇదే ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది.

మిథున్ రెడ్డికి కష్టాలు తప్పవా ?
లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డికి 100 కోట్లు ఇప్పించమని విజయసాయిరెడ్డికి సలహా ఎందుకు ఇచ్చారని, అది అప్పుగానా లేక మద్యం వ్యాపారంలో పెట్టుబడిగానా వంటి ప్రశ్నల్ని ఈడీ ఆయనకు సంధించినట్లు తెలుస్తోంది. దీంతో మిథున్ రెడ్డి వద్ద దీనికి సమాధానం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే ఈ మొత్తం ఇప్పించినట్లు మిథున్ రెడ్డి చెప్పి ప్రస్తుతానికి బయటపడినట్లు సమాచారం. అయితే ఈడీ తదుపరి విచారణలో ఈ వ్యవహారం కీలకంగా మారితే మిథున్ రెడ్డికి కష్టాలు తప్పకపోవచ్చు.












Click it and Unblock the Notifications