కౌంటింగ్ రోజు ఏం జరగనుంది - ఎందుకీ టెన్షన్..!!
ఏపీలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు పైన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. పైకి గెలుపు పైన ధీమాగా కనిపిస్తున్నా..లోలోపల ఆందోళన కొనసాగుతోంది. ఇదే సమయంలో ఎన్నికల సంఘం పైన వైసీపీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. ఎన్నికల సంఘం వైఫల్యాల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక..కౌంటింగ్ వేళ పొలిటికల్ టెన్షన్ మొదలైంది. దీంతో..ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది.
కొనసాగుతున్న ఉత్కంఠ
కౌంటింగ్ రోజు ఏం జరగబోతోందన్న ఆందోళన అందరిలోనూ సమొదలైంది. వైసీపీ నేతలు తాజాగా డీజీపీని కలిసారు. కౌంటింగ్ రోజు భద్రత పైన చర్చించారు. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి సైతం కౌంటింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు కలిసి పనిచేసిన కూటమి నేతలు, కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాల్సిన టైమ్ వచ్చిందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని నేతలను కోరారు. దీంతో..ఎన్నికల సంఘం అలర్ట్ అయింది. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్.. ఆతర్వాత జరిగే పరిణామాలపై ముందస్తు చర్యలు చేపట్టింది.

ప్రత్యేక అధికారుల నియామకం
ఏపీ ఎలక్షన్ కౌంటింగ్‌లో హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీసు ఆఫీసర్లను నియమించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన పల్నాడులో అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను నియమించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా పని చేస్తున్న లావణ్య లక్ష్మిని.. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు సిఐడి డిఎస్పి సోమన్నను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా పల్నాడు గురించి చర్చించారు. ఏకంగా ఎనిమిది మంది పోలీసు అధికారులను ప్రత్యేకంగా అక్కడ మొహరించారు.

ఈసీ కీలక నిర్ణయాలు
మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. కౌంటింగ్ రోజున భద్రత కోసం ఎన్నికల సంఘం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించింది. పూర్తిగా కేంద్రబలగాల నిఘా నీఢలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంది. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ తీసుకుంటుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతోంది. అటు ప్రధాన పార్టీల మధ్య గెలుపు పైన ఉత్కంఠ కొనసాగుతుంటే..పోలింగ్ అనంతర పరిణామాలతో ఏర్పడిన ఉద్రిక్తత మరో టెన్షన్ కు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications