చంద్రబాబు సర్కార్ కు వరదొచ్చినా.. కరువొచ్చినా పండుగే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ వరదల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అసలు స్వరూపం బయటపడిందని కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. వరదలను కూడా చంద్రబాబు పండుగ చేసుకున్నారని సంక్షోభం నుంచి కూడా చంద్రబాబు సంపద సృష్టించినట్టు ఉన్నారని చంద్రబాబును టార్గెట్ చేశారు.
వరద సాయం హారతి కర్పూరం చేసిన చంద్రబాబు సర్కార్
వరద సహాయక చర్యలను సకాలంలో అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొని, దాతల నుండి వచ్చిన సహాయాన్ని హారతి కర్పూరం చేశారంటూ మాజీ మంత్రి కన్నబాబు ఆరోపణలు చేశారు. ప్రజలు ఏమనుకుంటారో అన్న సిగ్గు కూడా లేకుండా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కన్న బాబు విమర్శించారు.

వినాయక చవితి, దసరా చందాల మాదిరిగా వసూళ్లు
వినాయక చవితి, దసరా చందాలు వసూలు చేసినట్టు వరదలకు సహాయం పేరుతో చంద్రబాబు వసూళ్లకు పాల్పడ్డాడని మొత్తం 368 కోట్లతో ఎంతమందికి చంద్రబాబు భోజనాలు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వానికి వరదొచ్చిన కరువొచ్చిన పండగేనని వ్యాఖ్యలు చేసిన కన్నా బాబు దాతల నుండి వచ్చిన వరద సహాయాన్ని ఎలా వాడుకుంటారు అంటూ ప్రశ్నించారు .
కొవ్వొత్తులకు, అగ్గిపెట్టెలకు 28 కోట్లు ఖర్చు చేశారా
కృష్ణ, గోదావరి వరదలకు చంద్రబాబు హడావిడి చేశాడని గుర్తు చేసి చంద్రబాబు వరదల పేరుతో, వరద సహాయంగా చేసిన వాటిలో తప్పు లెక్కలు రాసారని విమర్శించారు. కొవ్వొత్తులకు, అగ్గిపెట్టెలకు 28 కోట్లు ఖర్చు చేశారా అంటూ ప్రశ్నించారు. డ్రోన్ ల కోసం రెండు కోట్లు ఖర్చు చేశారా అని చంద్రబాబును నిలదీశారు.
ఇలా ఎలా లెక్కలు రాస్తారు
ఇప్పటివరకు వరదల కారణంగా నష్టపోయిన లక్షలాది ఎకరాలలో పంటలకు ఎన్యుమరేషన్ జరగలేదని కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. వరద సహాయం ద్వారా వచ్చిన డబ్బులను ఇంత దుర్మార్గంగా ఖర్చు చేసామని లెక్కలు ఎలా రాస్తారని ప్రశ్నించిన కన్న బాబు రేపు కచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేశారు.
బాబుపై తీవ్రంగా ఆరోపణలు
మొత్తంగా వరద సహాయంగా వచ్చిన నిధులను చంద్రబాబు వరద సహాయంగా కాకుండా ఇతర అవసరాలకు వాడుకున్నాడు అంటూ మాజీ మంత్రి ఆరోపణలు చేశారు. చంద్రబాబు తీరును, ప్రభుత్వ విధానాలను టార్గెట్ చేసి ఆయన నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications