"మీ ముగ్గురూ చాలు కదా..ఖర్చెందుకు దండగ?-చంద్రబాబుకు మాజీ ఇంటెల్ ఛీఫ్..!

ఏపీలో రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తనదైన శైలిలో పాలన సాగిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా గతానికి భిన్నంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. కేబినెట్లో మంత్రులు కూడా తనతో పోటీ పడాలని ఆయన పదే పదే చెప్తుంటారు. అయితే ఆయన కేబినెట్లో తనతో పాటు కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కువగా ఫోకస్ అవుతుంటారు. మిగతా మంత్రుల పాత్ర నామమాత్రమే అన్న విమర్శలు వినిపిస్తుంటాయి. ఇదే విషయం తాజాగా మరోసారి రుజువైంది.

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు విడుదల చేసే కార్యక్రమాన్ని ఇవాళ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాన పత్రికల్లో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో సీఎం చంద్రబాబుతో పాటు ప్రధాని మోడీ, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. సాగునీటిపారుదల ప్రాజెక్టు ప్రారంభోత్సవం అయినా ఆ శాఖను చూస్తున్న జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటో మాత్రం లేదు. దీనిపై చంద్రబాబు మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్, మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) వ్యంగాస్త్రాలు సంధించారు.

Former IPS Officer AB Venkateswara Rao Takes Dig at Naidu Says Three-Men Cabinet Is Enough

ముఖ్యమంత్రి గారూ,.. మీరు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పించి కాబినెట్ లోని మంత్రులందరూ నామమాత్రులే అనేది లోక విదితం అంటూ ఏబీ వెంకటేశ్వరావు ఇవాళ ట్వీట్ చేశారు. అయినా ఏదో సంప్రదాయాలంటూ ఉంటాయి కదా!, ఇరిగేషన్ ప్రాజెక్టు కార్యక్రమంలో ఇరిగేషన్ మంత్రి గారి ఫోటో లేకుండా సంబంధం లేని శాఖల మంత్రుల ఫోటోలు పెట్టారు, కేసీఆర్ 2018 లో 68 రోజుల పాటు తాను, మహమ్మద్ మహమూద్ ఆలీ మాత్రమే ఉండి, కాబినెట్ లేకుండా నడిపారు, మీరు కూడా త్రీ మెన్ కాబినెట్ తో పరిపాలించెయ్యొచ్చుగా? ఎందుకు ఖర్చు దండగ? అంటూ ఏబీవీ చురకలు అంటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+