సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జనసేనను వీడనున్నారా ? ఆ పార్టీలోకి జంప్ అవుతారా ?

ఎన్నికల ఫలితాల తరువాత సైలెంట్ అయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీని వీడి పవన్ కళ్యాణ్ కు షాకివ్వ‌బోతున్నారా? గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికి పరిమితమైన జ‌న‌సేనలో వుండ‌లేక బ‌య‌టికి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారా? జనసేన పార్టీ పట్ల మాజీ జేడీ లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? అంటే అవును అనే సంకేతాలు వస్తున్నట్లుగా తెలుస్తుంది.

 అవినీతి రహిత రాజకీయాలే లక్ష్యంగా రాజకీయాల్లోకి మాజీ జేడీ ఎంట్రీ

అవినీతి రహిత రాజకీయాలే లక్ష్యంగా రాజకీయాల్లోకి మాజీ జేడీ ఎంట్రీ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ఈ పేరు దేశంలోని ప్రజలందరికీ తెలుసు. జగన్ ఆర్థిక నేరాల కారణంగా , జగన్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేసి విచారణ జరిపిన ఉన్నతాధికారిగా, నిజాయితీపరుడైన సిబిఐ అధికారిగా ఆయనకు పేరుంది. ఇక ఉద్యోగానికి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించాలని భావించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. అవినీతిరహిత రాజకీయాలు చేయాలని భావించారు. గ్రామ స్వ‌రాజ్యమే నా స్వ‌ప్నం అని రాజ‌కీయాల్లోకి ఎంట‌ర‌య్యారు. అయితే సొంత పార్టీని పెట్టి ఎన్నికలకు వెళతారు అనుకున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ అనూహ్యంగా జ‌న‌సేన‌లో చేరి ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైజాగ్ నుంచి జ‌న‌సేన త‌రుపున ఎంపీగా పోటీ చేశారు. స్వచ్ఛమైన రాజకీయాలు చేసి రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నించిన లక్ష్మీనారాయణ ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే.

 ఓటమిపై స్పందించిన లక్ష్మీనారాయణ..తనపని తాను చేసుకు వెళతానని వివరణ

ఓటమిపై స్పందించిన లక్ష్మీనారాయణ..తనపని తాను చేసుకు వెళతానని వివరణ

పవన్ కళ్యాణ్ పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభావం చూపించగల నేతగా , సిన్సియర్ ఆఫీసర్ గా గుర్తించబడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం ఘోరంగా ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ విజయం సాధించారు.లక్ష్మీ నారాయణ కనీసం గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు . మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక తన ఓటమిపై లక్ష్మీ నారాయణ స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని అన్నారు. విజయం సాధించిన నరేంద్ర మోదీ, జగన్ లకు అభినందనలు తెలిపారు. తనపై విజయం సాధించిన ఎంవీవీ సత్యనారాయణను అభినందించారు. కొత్త ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. తనకు ఓటేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలకు సేవ చేసే విషయమై తనపని తాను చేసుకు వెళతానని అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .

బీజేపీ ఆహ్వానం .. బీజేపీలో చేరే ఆలోచన లక్ష్మీ నారాయణకు ఉందా?

బీజేపీ ఆహ్వానం .. బీజేపీలో చేరే ఆలోచన లక్ష్మీ నారాయణకు ఉందా?

ఆ త‌రువాత అసంతృప్తితో వున్న ఆయ‌న త్వ‌ర‌లో పార్టీ మారాల‌నుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.ఇక రాజకీయాల్లో మాజీ జేడీ లక్ష్మీ నారాయణకి తొలుత అవకాశమిచ్చింది బిజెపి. అయితే ఆయన బిజెపి ఇచ్చిన ఆఫర్ ను అప్పుడు నిరాకరించారు. ఆ తరువాత జేడీ నిజాయితీ న‌చ్చి లోక్‌స‌త్తా ప‌గ్గాలు ఆయ‌న‌కే అప్ప‌గిస్తాన‌ని, పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని అప్ప‌ట్లో జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ ఆఫ‌ర్ ఇచ్చినా జేడీ లోక్‌స‌త్తాలో చేర‌డానికి సుముఖ‌త చూపించ‌లేదు. ఇక ఆయనకు టీడీపీ కూడా ఆఫ‌ర్ ఇచ్చింది. వైసీపీ వ‌ర్గాలు విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఆ వైపు వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డ‌ని జేడీ చివ‌రి క్ష‌ణంలో జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే అక్క‌డ కూడా ప్రస్తుతం ఆయన వుండ‌లేక‌పోతున్నార‌ని, బీజేపీలోకి వెళ్లాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది.

లక్ష్మీనారాయణ చేరితే ఏపీలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసే అవ‌కాశం వుంటుంద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇక మాజీ జేడీని పార్టీలో చేర్చుకునేందుకు కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ విష‌యంలో లక్ష్మీనారాయణ ఏ నిర్ణయం తీసుకుంటారో మరి వేచి చూడాలి.అయితే విలువలకు ప్రాధాన్యం ఇచ్చే లక్ష్మీ నారాయణ పార్టీ మార్పును ఇష్టపడతారా అన్నది కూడా ప్రశ్నే ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+