వాళ్ళను చావబాది.. మరో వివాదంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్.. వీడియో వైరల్!!

మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న వైసీపీ విభేదాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సొంత పార్టీ నేతల పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ తనకు సహకరించడం లేదని వైసీపీలో ఉన్న అంతర్గత పోరు రోడ్డున పెట్టారు.

ఇక ఈ వ్యవహారం సీఎం జగన్ మోహన్ రెడ్డి వరకు వెళ్లి అనిల్ కుమార్ యాదవ్ ను పిలిచి జగన్ చర్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ రాదని పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఉన్న వివాదాల నుండి అనిల్ కుమార్ యాదవ్ బయటపడడం ఎలా అన్నది చిరాకు కలిగిస్తుంటే తాజాగా మరో కొత్త వివాదంలో ఆయన చిక్కుకున్నారు.

Anil Kumar Yadav

గచ్చిబౌలి అపర్ణ సెరెన్ అపార్ట్ మెంట్ లో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు ఫ్లాట్ ఉంది. ఈ క్రమంలో ఆయన అక్కడకు వెళ్ళారు. అయితే అపార్ట్మెంట్ పార్కింగ్ వివాదంలో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అపర్ణ సెరెన్ అపార్ట్మెంట్ పార్కింగ్ వివాదంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని తన అనుచరులతో చితకబాదారు. అపార్ట్మెంట్ రూల్స్ కు విరుద్ధంగా ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అని చెప్పిన కారణంగా సెక్యూరిటీ సిబ్బందిని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన మనుషులతో చావ చితక్కొట్టించారని సమాచారం.

ఇక ఈ తతంగమంతా అపార్ట్ మెంట్ వాసులు చిత్రీకరించగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు తాగి వచ్చి సిబ్బందిని కొట్టారని అపార్ట్ మెంట్ లో పలువురు చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. దీంతో అసలే పీకల్లోతు సమస్యల్లో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ తన చర్యలతో మరింత కష్టాల్లో పడుతున్నారని తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+