Narayana: సీఐడీకి చిక్కిన నారాయణ - ఆధారాలతో సహా : వాట్ నెక్స్ట్..!?

మాజీ మంత్రి నారాయణ నివాసంలో సీఐడీ సోదాల సమయంలో కీలక ఆధారాలు లభ్యం అయినట్లు తెలుస్తోంది.

టీడీపీ మాజీ మంత్రి నారాయణ (Narayana) సీఐడీ చేతికి చిక్కారా. ఏపీ సీఐడీ (AP CID)అధికారులు రెండు రోజులుగా నారాయణతో పాటుగా ఆయన కుమార్తెల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. అమరావతి (Amaravati) భూ లావాదేవీలకు సంబంధించి ఆరా తీస్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకల పైనే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని అయిదు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహించారు. నేడు రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ సోదాల సమయంలో సీఐడీకి కీలక ఆధారాలు లభ్యం అయినట్లు తెలుస్తోంది. అందులో కీలకమైన సమాచారం ఉందని..దీని ఆధారంగా తదుపరి నిర్ణయాల దిశగా సీఐడీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

రెండో రోజు కొనసాగుతున్న సోదాలు

రెండో రోజు కొనసాగుతున్న సోదాలు

మాజీ మంత్రి నారాయణ ఏపీ రాజధాని అమారావతి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. నాడు మున్సిపల్ మంత్రిగా అమరావతి మాస్టర్ ప్లాన్.. భూ సమీకరణ లో కీలకంగా ఉన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి అమరావతిలో భూ స్కాం జరిగిందని ఆరోపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వ్యవహారం పైన మంత్రివర్గ ఉప సంఘం నియమించింది.

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఖరారు చేసి.. ప్రకటనకు ముందే తమ అనుచరులకు మేలు చేసేలా వ్యవహరించారనేది వైసీపీ ఆరోపణ. ఇదే కేసుకు సంబంధించి గతంలో సీఐడీ మాజీ మంత్రి నారాయణను విచారించింది. ఈ కేసు కోర్టుకు చేరింది. ఇప్పుడు సీఐడీ నారాయణతో పాటుగా ఆయన కుమార్తెలకు సంబంధించి ఇందులో ప్రమేయం పైన ఆరా తీస్తున్నట్లు సమాచారం. రెండు రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా సోదాలు కొనసాగతున్నాయి.

సీఐడీ చేతికి కీలక ఆధారాలు

సీఐడీ చేతికి కీలక ఆధారాలు


అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు దొరికినట్లు సమాచారం. నారాయణ కూమార్తెలు, బంధువుల ఇళ్లల్లో సోదాల్లో భాగంగా సీఐడీ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో భాగంగా ఒక ఆడియో క్లిప్ స్వాధీనం చేసుకున్నారని..ఇది కీలకమైనదిగా చెబుతున్నారు. అందులో మాజీ మంత్రి నారాయణ..ఆయన కుమార్తె మధ్య జరిగిన సంభాషణలో ముఖ్యమైన సమాచారం ఉందని తెలుస్తోంది.

అందులో మనీ రూటింగ్‌కి సంబంధించి నారాయణ స్పష్టత ఇచ్చారని సమాచారం. మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు నారాయణ వివరించారని..ఈ ఆధారాలు ఇప్పుడు సీఐడీకి చిక్కాయని విశ్వసనీయ సమాచారం. ఆ ప్రకారమే మనీ రూటింగ్‌ చేయటం.. తద్వారా అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.

సీఐడీ చర్యల పై ఉత్కంఠ..

సీఐడీ చర్యల పై ఉత్కంఠ..


మనీ రూటింగ్‌కు పాల్పడి అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు గతంలోనే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో మంత్రి నారాయణ నివాసాలపై కూడా సీఐడీ అధికారులు సోదాలు చేసి కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పుడు నారాయణ కుమార్తె నివాసంలోనూ సోదాలు చేశారు. అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగాయనే అభియోగాలతో సాగుతున్న ఈ సోదాల్లో ఇప్పుడు లభించినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్ తో సీఐడీ తదుపరి అడుగులు ఏ విధంగా ఉండనున్నాయనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సీఐడీ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+