నితీశ్ తర్వాత వికెట్ చంద్రబాబే? మాజీ కేంద్రమంత్రి జోస్యం..!
గత కొన్ని రోజులుగా బీహార్ లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పదో సారి సీఎం పదవి చేపట్టిన నితీశ్ కుమార్ ను అర్ధాంతరంగా రాజీనామా చేయించిన బీజేపీ.. ఆయన్ను రాజ్యసభకు పంపి కేంద్రమంత్రిని చేయాలని నిర్ణయించడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై మిగతా రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్డీయేలో బలంగా ఉన్న నితీశ్ ను సాగనంపిన మోడీ.. ఇప్పుడు చంద్రబాబు (Chandrababu)నూ అలాగే చేస్తారనే చర్చ తెరపైకి వస్తోంది.
దీనిపై మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ (Chinta mohan) స్పందించారు. నితీష్ ను మింగినట్లే చంద్రబాబును కూడా బీజేపీ మింగబోతుందని ఆయన హెచ్చరికలు చేశారు. అప్పుడు ఏపీకి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కాలమే నిర్ణయిస్తుందన్నారు. నితీష్ కుమార్ బలిజ/ కాపు కులానికి చెందిన వ్యక్తి అని, బీజేపీ ప్రభుత్వానికి లొంగిపోయాడని చింతా మోహన్ తెలిపారు. బీజేపీ ఉత్తరప్రదేశ్ ను ఎలా కబళించిందో, బీహార్ ను కూడా అలాగే మింగేయబోతోందని ఆయన జోస్యం చెప్పారు.

నా మిత్రుడు చంద్రబాబు నాయుడు సంవత్సర కాలం కంటే, ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉంటాడనే నమ్మకం నాకైతే లేదని చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక చిన్న కుటుంబంలో పుట్టిన నా మిత్రుడు చంద్రబాబు నాయుడు, కరుణానిధి కుమారుడు కంటే కోటీశ్వరుడు అయ్యాడు, బిలీనియర్ అయ్యాడని చింతా మోహన్ తెలిపారు. వైఎస్ కుటుంబం కూడా ఒక చిన్న కుటుంబంలో పుట్టిందని, వైయస్ జగన్ మాజీ ముఖ్యమంత్రులే కాదు, ముఖ్యమంత్రులందరిలో కంటే, అత్యంత సంపన్నుడు అయ్యాడన్నారు.












Click it and Unblock the Notifications