Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..!
బీహార్ లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో రికార్ఢు స్ధాయిలో పదోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ (nitish kumar) పెను సంచలనం రేపేందుకు సిద్ధమయ్యారు. రేపు ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. బీహార్ లో తాజా ఎన్నికల్లో బీజేపీతో కలిసి విజయం సాధించిన నితీశ్.. కూటమి వ్యూహాల్లో భాగంగా తన పదవి వదులుకునేందుకు సిద్ధమయ్యారు.
బీహార్ సీఎం పదవి వదులుకుని రాజ్యసభకు వెళ్లేందుకు నితీశ్ కుమార్ సిద్దమవుతున్నారు. బీహార్ లో ప్రతిసారీ నితీశ్ తో కలిసి గెలుస్తున్నా.. సీఎం పదవిని మాత్రం ఆయనకే ఇస్తూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం నితీశ్ కుమార్ స్ధానంలో బీజేపీ సీఎం అభ్యర్ధిని ఎంపిక చేయనుంది. అదే జరిగితే బీహార్ పీఠంపై తొలిసారి బీజేపీ ఎమ్మెల్యే కొలువు దీరే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకే ముందే దీనిపై నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది.

బీహార్ ఎన్నికల వేళ సీఎం అభ్యర్ధిని ప్రకటించకుండానే కలిసి పోటీ చేసిన బీజేపీ.. ఆ తర్వాత ఆయన్ను తప్పించి రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. అనంతరం కేంద్ర కేబినెట్ లో ఆయనకు స్ధానం కల్పించబోతున్నారు. ఆయనకు బదులుగా బీజేపీ నేతకు బీహార్ సీఎం పదవి కట్టబెడతారు. ఈ మార్పు ప్రకారం రేపు నితీశ్ కుమార్ రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. అయితే చివరి నిమిషం వరకూ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారు. రేపు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసినా ఈ నెల 16 వరకూ ఆయన సీఎం పదవిలో కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications