పవన్ పెళ్లాల విషయం వాళ్లే తేల్చుకోవాలి...జగన్ కు ఆ హక్కు లేదు: ఉండవల్లి
న్యూ ఢిల్లీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శించే విషయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌దే తప్పని తేల్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు జగన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ ఆయన ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు ఎందరు పెళ్లాలు అన్నది వారే తేల్చుకోవాలని అన్నారు. ఐపీసీ చాప్టర్ 28 ప్రకారం ఈ విషయంపై మరొకరు కామెంట్ చేయకూడదని చెప్పారు. పవన్ విషయంపై ఆయన సతీమణులే తేల్చుకోవాల్సి ఉంటుందని...ఆ విషయమై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఇరు వర్గాలకు ఆరోగ్యకరం కాదన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయాలను కలుషితం చేయడం కిందకే వస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు వ్యక్తిగత విషయాలకు సంబంధం లేదన్నారు. వ్యక్తి అలవాట్లు చూసి ఓట్లు వేయరని...ఆ వ్యక్తి వల్ల తమకు ఎంత వరకు మేలనే విషయం చూసి జనం ఓట్లు వేస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!