Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతికి స్ధల దోషం..! అందుకే అలా.. జర జాగ్రత్త -చంద్రబాబు మాజీ మిత్రుడు షాకింగ్..!

ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణంపై రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడు కొనసాగిస్తుండగా.. విపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే క్రమంలో మరో సీనియర్ రాజకీయ నేత, సీఎం చంద్రబాబుకు మాజీ మిత్రుడు కూడా అయిన రాయలసీమ పొలిటిషియన్ ఇవాళ మరోసారి అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజధాని అమరావతిపై పరిస్థితులు బాగాలేవని, కర్నూలు నుంచి ప్రకాశం జిల్లా వరకు ప్రజలెవరూ సంతోషంగా లేరని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. రాయలసీమలో రాజధానిపై చిచ్చు మొదలైందన్నారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని, న్యూట్రల్ గా ఉంటానని వెల్లడించారు. నా మిత్రుడు చంద్రబాబు నాయుడు ఆశించిన రీతిలో అమరావతి క్లిక్ కాకపోవచ్చనేది తన అనుమానం అన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నట్లు తెలిపారు.

former union minister chinta mohan says location error to Amaravati alerted chandrababu

ఏపీకి పెట్టుబడులు రావడం అంత సులువు కాదని, అమరావతికి స్థల దోషం ఉన్నట్లు ఉందని చింతా మోహన్ తెలిపారు. పెట్టుబడులు వస్తాయన్న నమ్మకం తనకైతే లేదన్నారు. ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి వెళ్లారని, ప్రత్యేక గదుల్లో ఉన్నారని, దానివల్ల ఉపయోగం లేదని ఆయన తేల్చేశారు. చంద్రబాబు నాయుడు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాడని, ఏపీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడని తాను అనుకున్నానని, కానీ ఎక్కడో బెడిసి కొట్టిందన్నారు.

former union minister chinta mohan says location error to Amaravati alerted chandrababu

మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు, గౌతు లచ్చన్న.. నెహ్రూ, ప్రకాశం పంతులకు తిరుపతిని రాజధాని చేయమని చెప్పారని, గౌతు లచ్చన్న ప్రతిపాదనను, ఎన్జీ రంగా, తరిమెల నాగిరెడ్డి బలపరిచారన్నారు. కానీ నీలం సంజీవరెడ్డి కర్నూలుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. తర్వాత హైదరాబాదుకు, ఇప్పుడు రాజధాని అమరావతికి తన మిత్రుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారన్నారు.

మరోవైపు ఏపీలో మద్యం స్కాం దర్యాప్తుపైనా చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో పొలిటీషియన్లు ఉన్నారని, ఏపీ ప్రభుత్వం సిట్ వేసిందని, వారం రోజుల లోపు సిట్ రిపోర్ట్ బయటపెట్టాలని ఆయన కోరారు. నిజాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. నాసిరకం లిక్కర్ తాగి, కిడ్నీలు, లివర్ చెడిపోయాయి. ఎంతోమంది నిరుపేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన గుర్తుచేసారు. లిక్కర్ స్కామ్ లో తప్పు చేసినవారికి శిక్ష తప్పదన్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ ఆస్తిని కొన్నందుకు, ఆమె మరణించిన తరువాత కూడా కోర్టు శిక్ష వేసిందని గుర్తుచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+