ద్వారంపూడికి దడ పుట్టేలా.. కాకినాడలో కూల్చివేతలతో షాక్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆక్రమణలపైన, అనధికారిక నిర్మాణాల పైన ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆక్రమణలతో, కబ్జాలతో గత ప్రభుత్వంలో దందాలు చేసిన ముఖ్య నాయకులను ఫోకస్ చేస్తున్నారు. అలా కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేశారు.
పవన్ పర్యటన వేళ ద్వారంపూడికి షాక్
నేడు కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఇదే సమయంలో ఈరోజు కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడి భవనాన్ని కూల్చి వేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. అయితే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన అనుచరులతో వచ్చి అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కార్పొరేషన్ అధికారుల విధులకు అడ్డువస్తున్న ద్వారంపూడిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ద్వారంపూడి అనుచరుడి భవనం కూల్చివేత
అక్రమంగా స్థలం కబ్జా చేయడమే కాకుండా అక్రమ భవనం కడుతున్న ద్వారంపూడి బినామీ అనుచరుడికి కార్పొరేషన్ అధికారులు దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కార్పొరేషన్ అధికారులు ఈరోజు భవనం కూల్చివేతకు పాల్పడ్డారని టీడీపీ, జనసేన నేతలు చెప్తున్నారు.
ద్వారంపూడి పై టీడీపీ పోస్ట్
ఇక అక్రమ కట్టడాల కూల్చివేత సమయంలో ద్వారంపూడి వీరంగం వేశారని టీడీపీ ఒక పోస్ట్ పెట్టింది. అందులో ద్వారంపూడి వీడియోను షేర్ చేసింది. ఇక ఆ పోస్ట్ లో కాకినాడలో వైసీపీ రౌడీ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రెచ్చిపోయాడు. అక్రమంగా స్థలం కబ్జా చేయటమే కాకుండా, అక్రమ భవనం కడుతున్న ద్వారంపూడి బినామీ అనుచరుడికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
కాకినాడలో వైసీపీ రౌడీ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రెచ్చిపోయాడు. అక్రమంగా స్థలం కబ్జా చేయటమే కాకుండా, అక్రమ భవనం కడుతున్న ద్వారంపూడి బినామీ అనుచరుడికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులకు స్పందించకపోవటంతో, అక్రమ భవనం కూల్చడానికి వచ్చిన కార్పొరేషన్ అధికారులని అడ్డుకునే… pic.twitter.com/OlEF9vKz06
— Telugu Desam Party (@JaiTDP) July 3, 2024
రౌడీ ద్వారంపూడి అంటూ టార్గెట్ చేసిన టీడీపీ, స్పందించిన ద్వారంపూడి
నోటీసులకు స్పందించకపోవటంతో, అక్రమ భవనం కూల్చడానికి వచ్చిన కార్పొరేషన్ అధికారులని అడ్డుకునే ప్రయత్నం చేసాడు, రౌడీ ద్వారంపూడి అంటూ టార్గెట్ చేసింది. విధులకు అడ్డు వస్తున్న రౌడీ ద్వారంపూడిని, పోలీసులు ఎత్తి అవతల పడేసి, రూల్స్ ప్రకారం అక్రమ కట్టడాన్ని కూల్చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన రౌడీ ద్వారంపూడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని ట్వీట్ చేసింది. ఇక దీనిపై స్పందించిన ద్వారంపూడి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపులకు దిగుతోందని మండిపడ్డారు టార్గెట్ గానే ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు దీనిపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications