Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయవాడ నుంచి మిడిల్ ఈస్ట్ కు ఫ్లైట్ కనెక్టివిటీ- టైమింగ్స్

కువైట్ కు చెందిన ప్రతిష్ఠాత్మక జజీరా ఎయిర్‌వేస్ పౌర విమానయాన సంస్థ భారత్ లో తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించింది. విజయవాడ సహా నలుగు నగరాలకు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఈ నాలుగు నగరాలకు కూడా జజీరా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలి విమానం ఈ నెల 13వ తేదీన ప్రారంభం కానుంది. దీంతో కువైట్, దమ్మామ్ వంటి నగరాలకు నేరుగా విమాన సర్వీసులు మొదలైనట్టవుతుంది.

భారత్ లో తన ఫ్లైట్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ కువైట్‌కు నాలుగు కొత్త మార్గాలను ప్రారంభించబోతోంది జజీరా ఎయిర్ వేస్ సంస్థ. విజయవాడతో పాటు లక్నో, మధురై, గోవా నగరాలకు ఇప్పుడు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవడంలో భాగంగా ఈ నాలుగు నగరాలకు కొత్తగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్యాసింజర్, కార్గో రవాణా.. రెండూ అందుబాటులోకి వస్తాయి.

Four New Indian Destinations Join Jazeera Airways Network Connecting Vijayawada Lucknow Madurai Goa

ఏప్రిల్ 13 నుండి విజయవాడకు కువైట్, సౌదీ అరేబియాలోని దమ్మామ్ మీదుగా సోమ, బుధ, శుక్రవారాల్లో కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. జే9 3425 విమానం మధ్యాహ్నం 3:05 నిమిషాలకు కువైట్ నుంచి బయలుదేరి రాత్రి 11:05కు విజయవాడకు చేరుకుంటుంది. జే9 3426 విమానం రాత్రి 11:50 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి వేకువ జామున 3:10 నిమిషాలకు కువైట్ కు చేరుకుంటుంది. సమయాల్లో మార్పులు ఉండవచ్చు.

ఈ నాలుగూ అందుబాటులోకి రావడంతో జజీరా ఎయిర్‌లైన్స్ విమానాలు దేశంలో 16 నగరాలకు విస్తరించినట్టయింది. భారత్-కువైట్ మధ్య కీలక అనుసంధానంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. కొత్త విమానాలు సౌదీ అరేబియాలోని దమ్మామ్ మీదుగా నడుస్తాయి. ఈ వాయు-భూ మార్గాల కలయిక ప్రస్తుత సవాళ్ల మధ్య నిరాటంక ప్రయాణాన్ని అందిస్తుందని పేర్కొంది. వందే భారత్ ప్రాజెక్ట్‌లో భాగంగా లక్నో, విజయవాడ, మధురై, గోవా లకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు జజీరా ఎయిర్‌వేస్ సీఈఓ బరాథన్ పశుపతి తెలిపారు.

దేశంలో రద్దీ విమానాశ్రయాల్లో ఒకటి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్. కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం 1,265 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విమానాశ్రయంలో ఏ320, బీ737, ఏటీఆర్-72, బాంబార్డియర్ క్యూ400 వంటి విమానాల కోసం 24 పార్కింగ్ బేలు ఉన్నాయి. ఇక్కడి టెర్మినల్ 12,999 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైంది. ఇది ఒకేసారి 1,000 మందికి పైగా ప్రయాణీకులను హ్యాండిల్ చేయగలదు. ఇందులో చెక్ ఇన్, అరైవల్ హాల్, మీట్ అండ్ గ్రీట్ సర్వీస్, ఏవియేషన్ లాంజ్, బ్యాగేజ్ పికప్ ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+