ఉచిత బస్సు ప్రయాణం.. డ్రైవర్స్ విషయంలో ఆర్టీసీ హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి ఐదు రకాల బస్సులలో జీరో టికెట్ మీద ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఏపీలో బస్సులలో మహిళల ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. స్త్రీ శక్తి పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం పైన ఏపీ మహిళలు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు ఫ్రీగా ప్రయాణం చేస్తూ తమ పనులను చేసుకుంటున్నారు.

ఏపీలో బస్సుల్లో రద్దీతో కొత్త బస్సుల కొనుగోలు
మహిళల బస్సు ప్రయాణాలు పెరగడంతో ఏపీలో రద్దీకి తగ్గట్టుగా బస్సులను ఏర్పాటు చేయాలని భావించిన ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకు వస్తున్న ఏపీ సర్కార్ బస్సు ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చూస్తోంది.

Free bus travel APS RTC warns those who attacks on rtc drivers

Take a Poll

ఆర్టీసీ బస్టాండ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి
ఏపీలో బస్సు ప్రయాణాలలో పురుషులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో, బస్సుల సంఖ్యను పెంచి వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని భావిస్తోంది. ప్రయాణికులకు ఆర్టీసీ బస్టాండ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోలను, బస్టాండ్ లను సందర్శిస్తూ కీలక ప్రకటనలు చేస్తున్నారు.

2028 నాటికి అన్ని డిపోలకు ఎలక్ట్రికల్ బస్సులు
ఆర్టీసీ బస్సులు అందిస్తున్న సేవలు, ఉద్యోగుల పనితీరు, ప్రయాణికుల సౌకర్యాల పైన ఆరా తీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. 2028 నాటికి అన్ని డిపోలకు ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం అమలు తీరును పరిశీలించడానికి తను డిపోలలో పర్యటిస్తున్న వెల్లడించారు.

బస్సు డ్రైవర్ లపైన అలా చేస్తే కఠిన చర్యలు
ఇదే సమయంలో ఆర్టీసీ లో పనిచేస్తున్న డ్రైవర్ల విషయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ బస్సులు ఎక్కే ప్రయాణికులు ఎవరైనా ఆర్టీసీ బస్సులు డ్రైవర్ల పైన, లేదా అద్దె బస్సుల డ్రైవర్ల పైన దాడులు చేస్తే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది వేతనాల క్రమబద్దీకరణకు అధ్యయన కమిటీ వేసి న్యాయం చేస్తామని ఆయన అన్నారు.

ఏపీఎస్ ఆర్టీసీ తీవ్ర హెచ్చరిక
ఏపీలో బస్సులలో రద్దీ పెరిగిన క్రమంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో, ఆర్టీసీ కండక్టర్ లతో ప్రయాణికులు గొడవలు పడి పలుచోట్ల దాడులకు యత్నిస్తున్న క్రమంలో ఈ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆర్టీసీ డ్రైవర్ల పైన దాడులు చేస్తే క్షమించేది లేదని, కఠినంగా శిక్ష పడేలా చేస్తామని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+