Tirupati: తిరుపతి ప్రయాణికులకు అలర్ట్-ఈ 4 రైళ్లకు టెర్మినల్ మార్పు..!
తిరుపతి (tirupati) నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే (south central railway) ఓ కీలక అలర్ట్ జారీ చేసింది. తమిళనాడు నుంచి తిరుపతి వైపుకు ప్రయాణించే నాలుగు రైళ్లకు టెర్మినల్ మార్పు చేసింది. ఈ మార్పు మే వరకూ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ మార్పు కారణంగా ఇతర స్టేషన్లలో ఆయా రైళ్ల హాల్ట్ లలో ఎలాంటి మార్పూ లేదని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాబట్టి ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరుతోంది.
అరక్కోణం నుంచి తిరుపతికి రావాల్సిన మెమూ రైలు నంబర్ 66043ను మరో మూడు నెలల పాటు అంటే మే 30 వరకూ తిరుచానూరు స్టేషన్ కు మార్చారు. అలాగే తిరుపతి నుంచి చెన్నె సెంట్రల్ కు బయలుదేరాల్సిన మరో మెమూ రైలు నంబర్ 66070ను కూడా తిరుచానూరు నుంచి నడుపుతున్నారు. వీటితో పాటు చెన్నై సెంట్రల్ సబర్బన్ నుంచి తిరుపతికి ప్రయాణించే మెమూ రైలు నంబర్ 66069ని కూడా తిరుచానూరుకు మార్చారు. అలాగే అరక్కోణానికి వెళ్లాల్సిన మరో మెమూ రైలు నంబర్ 66044ని కూడా తిరుపతికి బదులు తిరుచానూరుకు టెర్మినల్ మార్చి నడుపుతున్నారు.

తిరుపతి స్టేషన్ పై రద్దీ తగ్గింపుతో పాటు ఇతరత్రా కారణాలతో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ రిజర్వేషన్ లేని రైళ్లే కావడంతో సాధారణ రైళ్ల ప్రయాణాలతో వీటికి ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే ముందుగా రిజర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అప్పటికప్పుడు వీటి అందుబాటును బట్టి ప్రయాణాలు చేసుకునేందుకు వీలుంటుంది. మే 30 తర్వాత మరోసారి పరిస్ధితిని సమీక్షించి దీన్ని కొనసాగించాలా లేక మార్పు చేయాలా అన్నది దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించనుంది.












Click it and Unblock the Notifications