Rail miles: రైల్వే బంపర్ ఆఫర్- ట్రైన్ ఎక్కితే రివార్డులు..!
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ మధ్య రైల్వే (south central railway) పరిధిలోని రైలు ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్. రైళ్లలో తరచూ ప్రయాణాలు చేసే వారిని, అప్పుడప్పుడూ అవసరానికి ప్రయాణాలు చేసే వారిని వేరు చేస్తూ ఓ విన్నూత్న లాయల్టీ ప్రోగ్రామ్ ను రైల్వే ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా తరచుగా రైల్వే ప్రయాణాలు చేసే ప్రయాణికులకు రివార్డ్స్ అందిస్తారు. వీటిని ఎక్కడెక్కడ రిడీమ్ చేసుకోవచ్చో కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ముందే చెప్తారు.
రైల్ మైల్స్ లాయల్టీ ప్రోగ్రామ్ (south central railway)
దేశంలోనే తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే 'రైల్ మైల్స్’ అనే జాతీయ లాయల్టీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించబోతోంది. ముందుగా హైదరాబాద్ డివిజన్ లో దీన్ని ప్రారంభిస్తారు. అనంతరం మిగిలిన డివిజన్లకు విస్తరిస్తారు. ఇందులో భాగంగా తరచుగా ప్రయాణించే వారిని ప్రోత్సహించి, పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని పెంచడం దీని లక్ష్యం. ప్రయాణ దూరం, తరగతి, సామర్థ్యం, విద్యుదీకరించబడిన మార్గాల ఆధారంగా ప్రయాణికులు 'గ్రీన్ మైల్స్' సంపాదిస్తారు. సరుకు రవాణాదారులు టన్-కిలోమీటర్ల ఆధారంగా మైల్స్ సంపాదించవచ్చు.

పాయింట్స్ రిడీమ్ ఇలా
ఈ 'గ్రీన్ మైల్స్' ను రైళ్లలో క్లాస్ అప్‌గ్రేడ్‌లు, ప్రీమియం లాంజ్‌లు, రిటైరింగ్ రూమ్ బుకింగ్‌లు, హోటల్, మైక్రో-స్టేలు, ఛార్జీల క్రెడిట్‌లు, భాగస్వామి ఆఫర్ల కోసం రీడీమ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇందులో సిల్వర్, గోల్డ్, ప్లాటినం పేరుతో మొత్తం మూడు స్ధాయిల వ్యవస్ధ ఉంటుంది. ఈ 'రైల్ మైల్స్’ కార్యక్రమం రూపకల్పన, సాంకేతిక అభివృద్ధి, అమలుకు దక్షిణ మధ్య రైల్వే ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రతిపాదనలు ఆహ్వనించింది. పరిశ్రమలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థలు ఇందులో పాల్గొనవచ్చు. ఎంపికైన వారు రోజుకు లక్షలాది లావాదేవీలు నిర్వహించగల డిజిటల్ మౌలిక సదుపాయాలు నిర్మించాల్సి ఉంటుంది. ప్రయాణికుల డేటా అనుసంధానం, రియల్ టైం బహుమతుల కేటాయింపు చేయాల్సి ఉంటుంది.

ఎన్నో ఉపయోగాలు
విమానయానం, ఆతిథ్యం, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఇప్పటికే లాయల్టీ ప్రోగ్రామ్‌లతో కస్టమర్ రిటెన్షన్, డేటా ఆధారిత నిర్ణయాలు, బ్రాండ్ ఈక్విటీని పెంచాయి. భారతీయ రైల్వేలలో అలాంటి చర్యలు లేకపోవడం వల్ల అవకాశాలు కోల్పోతోంది. దీంతో అధికారులు ఇప్పుడు ఈ కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ 'రైల్ మైల్స్’ విజయవంతమైతే, లక్షలాది ప్రయాణీకులు భారతీయ రైల్వేలతో అనుసంధానం పెరుగుతుంది. సాధారణ ప్రయాణాన్ని బహుమతి-ఆధారిత వ్యవస్థగా మారుస్తుంది. చివరిగా ఈ డేటా రైల్వేలకు రవాణా మోడల్ ను, డిమాండ్‌ను, ప్రాధాన్యతలను అర్థం చేసుకునేందుకూ ఉపయోగపడుతుంది.












Click it and Unblock the Notifications