వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై ఆసక్తికరం: అద్దం ముందు నిలబడి స్పీచ్ ప్రాక్టీస్, అసెంబ్లీకి హజరైన గిడ్డి ఈశ్వరీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య మంగళవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చంద్రబాబునాయుడు క్లాస్ తీసుుకొంటున్నారని మంత్రులు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీకి ఖచ్చితంగా హజరుకావాల్సిందేనని చెప్పారు.

బాబుపై ప్రశంసలు, త్వరలోనే రాజకీయాల్లోకి, జయప్రద ప్లాన్ ఇదే!బాబుపై ప్రశంసలు, త్వరలోనే రాజకీయాల్లోకి, జయప్రద ప్లాన్ ఇదే!

ఏపీ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి, బిజెపి సభ్యులు మాత్రమే ఉన్నారు. సభలో విపక్షం పాత్రను కూడ టిడిపి ఎమ్మెల్యేలు పోషించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టిడిపి శాసనసభపక్ష సమావేశంలో ఆదేశించారు.

బాబు బాటలోనే జగన్:' ఆ స్థానాల్లో బోయలకే ఎంపీ టిక్కెట్టు, సమస్యలు పరిష్కరిస్తా'బాబు బాటలోనే జగన్:' ఆ స్థానాల్లో బోయలకే ఎంపీ టిక్కెట్టు, సమస్యలు పరిష్కరిస్తా'

టిడిఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నట్టుగానే కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీకి సక్రమంగా హజరు కాకపోవడంపై చంద్రబాబునాయుడు సోమవారం నాడు సీరియస్ అయ్యారు.

క్రమశిక్షణను పాటించకపోతే బాబు సీరియస్

క్రమశిక్షణను పాటించకపోతే బాబు సీరియస్

క్రమశిక్షణ విషయంలో చంద్రబాబు కచ్చితంగా వ్యవహరిస్తున్నారని ఏపీ అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది. అసెంబ్లీకి సభ్యులు రాకుంటే సీఎం సీరియస్ అవుతున్నారని ఓ మంత్రి చెప్పారు.. అసెంబ్లీకి వచ్చిన వాళ్ల దగ్గర గైర్హాజరైన వాళ్ల గురించి సీఎం తిడుతున్నారంటూ రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్యే చమత్కరించారు. అయితే సభను సీరియస్‌గా తీసుకోని వాళ్లకు అదే స్థాయిలో సీఎం స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు.

అద్దం ముందు మాట్లాడి ప్రాక్టీస్

అద్దం ముందు మాట్లాడి ప్రాక్టీస్

అసెంబ్లీలో సభ్యులు మాట్లాడే తీరును కూడ సీఎం విశ్లేషిస్తున్నారని మరో మంత్రి గుర్తు చేశారు. సరిగా మాట్లాడని సభ్యులను అద్దం ముందు నిలబడి ప్రాక్టీసు చేయాలని చంద్రబాబు నాయుడు సూచిస్తున్నారని ఓ మంత్రి ఎమ్మెల్యేలకు, తోటి మంత్రులకు వివరించారు. తేనీటి విరామం సమయంలో అసెంబ్లీ లాబీలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఈ చర్చ సాగింది.

అసెంబ్లీకి హజరైన గిడ్డి ఈశ్వరీ

అసెంబ్లీకి హజరైన గిడ్డి ఈశ్వరీ

వైసీపీని వీడి గిడ్డి ఈశ్వరీ నవంబర్ 27న, టిడిపిలో చేరారు. అమరావతిలో ఆమె చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. అయితే వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. టిడిపిలో చేరినందున గిడ్డి ఈశ్వరీ నవంబర్ 28న, అసెంబ్లీకి హజరైంది.

బాక్సైట్ అంశంపై గిడ్డి ఈశ్వరీ ప్రసంగించే ఛాన్స్

బాక్సైట్ అంశంపై గిడ్డి ఈశ్వరీ ప్రసంగించే ఛాన్స్

పార్టీ మారిన అనంతరం ఆమె మొదటిసారిగా ఏపీ అసెంబ్లీకి వచ్చారు. అయితే మధ్యాహ్నం వరకు అసెంబ్లీలో ప్రసంగించలేదు. మధ్యాహ్నం తర్వాత బాక్సైట్ విషయంపై గిడ్డి ఈశ్వరి అసెంబ్లీలో మాట్లాడే అవకాశముంది. ఇవాళ అసెంబ్లీలో హంద్రీనీవా ప్రాజెక్టు, విద్యుత్ సమస్యలు, సోలార్ ప్లాంట్ విషయంపై పలువురు శాసన సభ్యుల ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిచ్చారు.

English summary
Funny conversation between ministers and mlas in Ap Assembly lobby on Tuesday.Paderu MLA Giddi Eswari attended Assembly on Tuesday, Eswari joined in TDP on Monday at Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X