• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాబోయేది టీడీపీకి గడ్డు కాలం .. బాబు కాంగ్రెస్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగేది అందుకే అన్న జీవీఎల్

|

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు . ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని అన్నారు.ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ చతికిలబడిందని , చంద్రబాబేమో ఆ పార్టీ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటమి భయం పట్టుకున్న చంద్రబాబు ఏం చేస్తున్నాడో అర్ధం కావటం లేదని జీవీఎల్ అన్నారు.

ఆ నియోజ‌క‌వ‌ర్గాల‌పై వైసీపీలో టెన్ష‌న్ : రాప్తాడులో ఏం జ‌రిగింది: టీడీపీ ప్లాన్ ఇదే అంటూ..!

కేంద్రంలో బీజేపీ విజయం సాధించటం ఖాయం అన్న జీవీఎల్

కేంద్రంలో బీజేపీ విజయం సాధించటం ఖాయం అన్న జీవీఎల్

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధించడం ఖాయమన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఐదేళ్లపాటు మోదీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మళ్లీ ఆయన ప్రభుత్వానికే పట్టం కట్టనున్నారని తెలిపారు. ఐదేళ్లపాటు అహర్నిశలు శ్రమించిన ప్రధానిగా మోదీకి పేరుందని ఆయన పేర్కొన్నారు . ప్రస్తుతం ఓట్ల శాతాన్ని చూస్తుంటే బీజేపీకి అనుకూలమేనని ఆయన అభిప్రాయపడ్డారు. స్పష్టమైన మెజార్టీ బీజేపీకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

టీడీపీకి రానుంది గడ్డుకాలం .. ఓటమి ఖాయం అన్న బీజేపీనేత జీవీఎల్

టీడీపీకి రానుంది గడ్డుకాలం .. ఓటమి ఖాయం అన్న బీజేపీనేత జీవీఎల్

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై , టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని చెప్పారు జీవీఎల్. టీడీపీ ఓటమి తర్వాత టీడీపీ అవినీతి చిట్టా బయటపెడతామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకున్నా ఇక ముందు దాగదన్నారు. అధికార దుర్వినియోగంతో చంద్రబాబు అవినీతిని ఆపగలిగారన్నారు.రాబోయేది తెలుగుదేశం పార్టీ నేతలకు గడ్డుకాలంగా పరిగణించబోతుందని హెచ్చరించారు. కేవలం డబ్బుతోనే ఎన్నికలను శాసించవచ్చునని టీడీపీ నేతల భావన తప్పు అని ప్రజల తీర్పు చూసి అర్థమవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జీవీఎల్.

చంద్రబాబు కాంగ్రెస్ చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరిగేది అందుకే అన్న జీవీఎల్

చంద్రబాబు కాంగ్రెస్ చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరిగేది అందుకే అన్న జీవీఎల్

ఈ నెల 23 తర్వాత చంద్రబాబును కలిసేందుకు ఎవరూ ఇష్టపడరని వ్యాఖ్యానించారు. ఫలితాలు వచ్చిన తర్వాత తిరగడానికి ఏమీ ఉండదని తెలిసి, చంద్రబాబు ఇప్పుడే కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు .ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ చతికిలపడిందని అన్నారు. చంద్రబాబు ఆ పార్టీ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అవినీతి కారణంగా సంపాదించిన డబ్బును అన్ని రాష్ట్రాల్లో పంచారని జీవీఎల్ ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కు దక్కేది 55 సీట్లేనని, సోనియా గాంధీ ఈ నెల 23న పెట్టే సమావేశం కేవలం బాధను వ్యక్తపరుచుకోవడానికేనని జీవీఎల్ పేర్కొన్నారు.

English summary
BJP MP GVL Narasimha Rao was furious against AP CM Chandrababu. Speaking to media in Delhi, he said that TDP was defeated in the AP election. After TDP's defeat, BJP has made it clear that the corruption of the TDP will be exposed out . So far TDP leaders have covered their corruption, but it is no more going to be encouraged said GVL .Is Chandrababu been able to stop corruption by misusing power. GVL Narasimha Rao warned that the future of TDP would be considered the worst. GVL strongly commented on the verdict of the TDP leader's opinion that only by money they can win the elections and GVL said that was wrong and TDP will get to know the people's decision after the results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X