హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ కారిడార్ సహా 26రైల్వే ప్రాజెక్టులపై పండుగలాంటి వార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రగతికి అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఏపీలోని ప్రతి నియోజకవర్గాన్ని రైల్వే నెట్వర్క్ తో అనుసంధానం చేయడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోంది. ఏపీలోని కూటమి ప్రభుత్వం రహదారులు, విమానాశ్రయాలను మాత్రమే కాకుండా రైల్వే వ్యవస్థను కూడా పటిష్టం చేయాలని ప్రణాళికలను రూపొందిస్తోంది.
11 కీలక మార్గాలలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి డీపీఆర్ లు
మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి 11కీలక మార్గాలలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ లు తయారు చేసే పనులలో ప్రస్తుతం ప్రభుత్వ నిమగ్నమైంది. మచిలీపట్నం నర్సాపురం, ఒంగోలు దొనకొండ, దూపాడు బేతంచెర్ల వంటి కీలక మార్గాలలో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం తన వంతుగా ప్రయత్నం చేస్తోంది.

1960 కిలోమీటర్ల 26 రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్ లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1960 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 26 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన డి పి ఆర్ లు సిద్ధం చేస్తోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైళ్ల రద్దీని నివారించడానికి, ప్రజలకు మరింత మెరుగైన రైల్వే సేవలను అందించడానికి అవసరమైన ప్రాంతాలలో కొత్త రైల్వే లైన్ లను నిర్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలోనే రైల్వే శాఖ రాష్ట్రంలో మొత్తం 11మార్గాలలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యతను ఇస్తుంది.
ఆ కొత్త మార్గాలకు డీపీఆర్ లపై కసరత్తు
ఈ మార్గాలలో గతంలోనే సర్వేలను పూర్తి చేసిన ప్రభుత్వం రైల్వే బోర్డు ఆమోదంతో డిపిఆర్ లను రూపొందిస్తోంది. ఏపీకి సంబంధించి మచిలీపట్నం నరసాపురం, ఒంగోలు దొనకొండ, దూపాడు బేతంచెర్ల, మచిలీపట్నం రేపల్లె, బాపట్ల రేపల్లె, పాలసముద్రం నారాయణపురం, కాచిగూడ- చిట్యాల- జగ్గయ్యపేట, కొండపల్లి సత్తుపల్లి, కొత్తగూడెం కిరండోల్, వంటి కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్ లు తయారు చేస్తుంది.
హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై కారిడార్ లలో కసరత్తు
హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ కారిడార్ లో ఏపీ మీదుగా మూడు వందల కిలోమీటర్లు, హైదరాబాద్ చెన్నై కారిడార్ లో 464 కిలోమీటర్ల డి పి ఆర్ ల పై కూడా ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. ఇదిలా ఉంటే విశాఖపట్నం విజయవాడ, హైదరాబాద్ చెన్నై మార్గాలలో సరుకు రవాణా రైళ్ల రాకపోకలు పెరుగుతున్నాయి. దీంతో ఈ మార్గాలలో మూడు నాలుగు లైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రైల్వే.
డిసెంబర్ వరకు 26 రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్ లు
సింహాచలం నుండి కొత్తవలస వరకు ఐదు, ఆరు లైన్ల డి పి ఆర్ లు కూడా రెడీ చేస్తున్నారు. మొత్తం డిసెంబర్ వరకు 26 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను పూర్తిచేసి వాటిని పరిశీలించి ఆమోదించి కార్య క్షేత్రంలోకి దిగాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. సింహాచలం నుండి కొత్తవలస వరకు ఐదు, ఆరో లైన్ల డీపీఆర్‌లు కూడా సిద్ధమవుతున్నాయి.
కొత్త రైల్వే లైన్లతో పాటు బైపాస్ లైన్లు
మొత్తం 26 ప్రాజెక్టుల డీపీఆర్‌లను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా గుంతకల్లు- పేరేచర్ల- మంగళగిరి వద్ద బైపాస్ లైన్లు, కొత్తవలస అనకాపల్లి మధ్య బైపాస్ లైన్, గోపాలపట్నం దువ్వాడ మధ్య మూడు నాలుగో లైన్లు, సూళ్లూరుపేట గూడూరు మధ్య మూడు నాలుగో లైన్లు, కాజీపేట విజయవాడ మధ్య నాలుగో లైన్, విజయవాడ గూడూరు మధ్య నాలుగో లైను, గుంతకల్లు బళ్లారి మధ్య నాలుగో లైను వంటి అనేక రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications