ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్

వాతావరణ పరిస్థితులు అనుకూలించనప్పుడు, భారీ వర్షాల సమయంలో రైళ్లు ఆలస్యమవుతుంటాయి. లేదంటే వేరే రైలు మారాల్సివచ్చినప్పుడు స్టేషన్ లోనే గంటల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు హోటల్ లో కాకుండా రైల్వేస్టేషన్ లో ఐఆర్సీటీసీ రిటైరింగ్ రూమ్స్ ఎంపిక చేసుకోవచ్చు. బయట హోటల్ అంటే ఖర్చు తడిసి మోపడవుతుంది. రిటైరింగ్ రూమ్స్ కూడా బయట లభించే హోటల్ గదులకన్నా ఎక్కువ సౌకర్యంగా, తక్కువ ఖర్చుతో లభిస్తాయి. అయితే వీటిని ఎలా బుక్ చేసుకోవాలి? అనే విషయమై చాలామందికి అవగాహన లేదు. వీటిగురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో వసతి సౌకర్యం వీటిద్వారా లభిస్తోంది. చాలా తక్కువ ఖర్చు అని చెప్పవచ్చు. ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్, డార్మెటరీ తరహాలో గదులు అందుబాటులో ఉంటాయి. గంట నుంచి 48 గంటల వరకు వీటిని బుక్ చేసుకోవచ్చు. ప్రాంతాన్ని బట్టి వీటి ఛార్జీలు మారుతుంటాయి. రూ.100 నుంచి రూ.700 వరకు ఉంటాయి. టికెట్ రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఈ రూమ్స్ కేటాయిస్తారు. అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ తోపాటు ఆఫ్ లైన్ లో కూడా వీటిని బుక్ చేసుకోవచ్చు.

good news for railway passengers india wide

irctc వెబ్ సైట్ లోకి లాగిన్ కావాలి. irctc account సెక్షన్ లోకి వెళ్లి my bookingపై క్లిక్ చేయాలి. పేజీని కిందకు స్క్రోల్ చేయగానే retiring room ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై పీఎన్ ఆర్ నెంబరు, స్టే చేయాలనుకుంటున్న స్టేషన్ వివరాలు నమోదు చేయాలి. తర్వాత చెక్ ఇన్, చెక్ ఔట్, బెడ్ టైప్ లాంటి వివరాలన్నీ పూర్తిచేయాలి. స్లాట్ డ్యూరేషన్, ఐడీ కార్డు వంటి వివరాలను సరిచూసుకొని పేమెంట్ చేయాలి. పేమెంట్ పూర్తవగానే మీపేరు మీద రూమ్ బుక్ అవుతుంది. ఏదైనా కారణంవల్ల 48 గంటలకు ముందుగా రూమ్ క్యాన్సిలేషన్ చేయించుకుంటే 10 శాతాన్ని రూమ్ బుకింగ్ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి ఒకరోజు ముందు క్యాన్సిల్ చేసుకుంటే బుకింగ్ ధరలో 50 శాతాన్ని మినహాయించుకుంటారు. ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే తిరిగి చెల్లింపులు ఉండవు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకొని రూమ్ బుక్ చేసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+