ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఉచిత ఇసుక విధానానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.. ఎప్పటినుండంటే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఇసుక పాలసీ పైన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన ఏపీలో ఇసుక పంపిణీ విధానంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల క్రితం టిడిపి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని మళ్లీ ఇప్పుడు కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు.

ఏపీలో మళ్ళీ ఉచిత ఇసుక విధానం
ఈ మేరకు ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని జులై 8వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకానికి సంబంధించి ఇసుక లోడింగ్, రవాణా చార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Good news for the people of AP Chandrababu green signal for free sand policy in ap from july 8th

జగన్ ఇసుక పాలసీతో ప్రజలు నష్టపోయారు
నిన్న సుదీర్ఘంగా ఇసుక విధానం పైన సమీక్ష నిర్వహించిన చంద్రబాబు జగన్ పరిపాలన సమయంలో ఇసుక పాలసీ వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణరంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి భారీగా ధరలను పెంచి, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుర్తించినట్టు చంద్రబాబు పేర్కొన్నారు.

ఉచిత ఇసుక విధానంపై చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేయడంతో పాటు ఇసుక రీచ్ లు, స్టాక్ పాయింట్ల వద్ద ఎంత ఇసుక అందుబాటులో ఉందో లెక్క చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం 40 లక్షల టన్నులు ఇసుక అందుబాటులో ఉందని లెక్క చెప్పారు అధికారులు. ఇక తాజాగా ఉచిత ఇసుక విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఉచిత ఇసుక విధానం శుభ పరిణామం: మంత్రి కొల్లు రవీంద్ర
ఇక తాజాగా చంద్రబాబు జులై 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధాన అమలులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకోవటం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశ పెట్టడం శుభ పరిణామం అని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లు ఇసుక పేరుతో వైసిపి నేతలు దోపిడీ చేశారని ఆరోపించారు. ఇకపై ఎవరికి ఇసుక కావాలన్నా సులభంగా అందేలా చూస్తామని పేర్కొన్నారు.

వైసీపీ హయాంలో జనాలకు ఇసుక కష్టాలున్నాయన్న మంత్రి
వైసిపి అధికారంలోకి రాగానే ఇసుక లభ్యం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని నిర్మాణరంగం కుదిలైందని మంత్రి పేర్కొన్నారు. కోట్లాదిమంది జీవనోపాధి కోల్పోయారని అన్నారు. ఇక తాజాగా చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయంతో ఏపీ ప్రజలకు మరో శుభవార్త అందినట్టు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+