శుభవార్త: ఏపీ, తెలంగాణాలలో ఐదేళ్ళలో ఈ నగరాలలో రైళ్ళ సామర్ధ్యం డబుల్!
భారతీయ రైల్వే తన సేవలను విస్తరిస్తూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ సౌఖ్యాన్ని ఇస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనకు కూడా పెద్ద పీట వేస్తుంది. ఈ క్రమంలోనే దేశంలో నిరంతరం పెరుగుతున్న రైలు ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా, కీలకమైన రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ స్టేషన్ లలో రైల్వే సామర్ధ్యాన్ని పెంచే పనిలో రైల్వే
భవిష్యత్ అవసరాలకు తగినట్టు దేశంలోని వివిధ స్టేషన్ లలో రైల్వే సామర్ధ్యాన్ని పెంచే పనిలో ఉంది. ఈ క్రమంలో రాబోయే ఐదేళ్లలో 48 ప్రధాన నగరాల నుండి బయల్దేరే రైళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యాచరణను నిర్విఘ్నంగా కొనసాగించాలని ప్రయత్నం చేస్తుంది. 2030 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని ప్రణాళికలు రూపొందించింది.

ఆయా స్టేషన్ లలో సామర్ధ్యం పెంపుకు జరుగుతున్న పనులు
ఈ ప్రణాళికలో భాగంగా, ప్రస్తుత మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని రైల్వే శాఖ అభిప్రాయపడింది. ఇందుకోసం టెర్మినల్స్‌లో అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణం, నగరాలకు సమీపంలో కొత్త టర్మినల్స్ ఏర్పాటు, నిర్వహణ, సౌకర్యాల మెరుగుదల, మరియు సెక్షనల్ కెపాసిటీని పెంచడం వంటి చర్యలు చేపడుతోంది.
తెలుగు రాష్ట్రాల నుండి ఈ నగరాలలో రైల్వే పురోభివృద్ధి పనులు
తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి రైల్వే స్టేషన్లు ప్రధానంగా ఇందులో ఉన్నాయి. ఇవి మాత్రమే కాక దిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పట్నా, పుణె వంటి ప్రధాన నగరాలు కూడా ఈ ప్రణాళికలో ఉన్నాయి. మొత్తం ఈ 48 నగరాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రైల్వే ప్లానింగ్ డైరెక్టరేట్‌కు సమర్పించనున్నారు.
ఈ నగరాలపైనా రైల్వే దృష్టి
అహ్మదాబాద్, లక్నో, నాగపూర్, వారణాసి, కాన్పూర్, గోరఖ్ పూర్, మధుర అయోధ్య, ఆగ్రా, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, చండీగర్, అమృత్సర్, ఇండోర్, భోపాల్, ఉజ్జయిని, బరేలీ, రాయపూర్, రాంచి, దర్భంగా, ముజఫర్పూర్, భాగల్పూర్, గౌహతి, భువనేశ్వర్, పూరి, కొచ్చిన్, వడోదర, జైపూర్, జోధ్పూర్, జమ్మూ, మద్గావ్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయటమే లక్ష్యం
అయితే ఇందులో ఇప్పటికే ఆమోదం పొందిన లేదా ప్రతిపాదిత ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడమే రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యం. ఆ పనిలో రైల్వే బిజీగా ఉంది. ఈ బృహత్తర కార్యక్రమంలో కూడా రైల్వే తెలుగు రాష్ట్రాలలోని నగరాలకు ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications