ఏపీకి భారీ వర్ష సూచన -మూడురోజుల పాటు- పశ్చిమ, నైరుతి గాలులతో
ఏపీలో రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఇప్పటికే రాష్టవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలకు తోడు పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దీంతో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో రైతులు నాట్లు వేసుకుంటున్నారు. ఈ తరుణంలో మరిన్ని వర్షాలు వారిని పలకరించబోతున్నాయి.
రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్న బలమైన గాలులతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.. వీటిలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే వరుసగా మూడో ఏడాది వర్షాలు బాగా కురుస్తుండటంతో పంటలు వేసుకునేందుకు అనువైన వాతావరణం కనిపిస్తోంది. భారీ వర్షాలతో జలాశయాల్లోనూ భారీగా నీరు చేరుతోంది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరుగుతోంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. పరిస్దితిని బట్టి స్ధానికంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తోంది.












Click it and Unblock the Notifications