TTD: తిరుమల భక్తులకు హైకోర్టు కీలక సూచనలు..!!

Tirumala: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదోవ రోజు ఆదివారం ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరధంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు పురవీధుల్లోకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అలాగే ఈరోజు రాత్రి 7 గంటలకు శ్రీనివాసుడు అశ్వ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజుతో శ్రీవారి వాహన సేవలు ముగియనున్నాయి.

న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ‌నివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్ర‌భ వాహ‌నంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భ‌క్తుల‌ను క‌టాక్షించారు. సోమవారం ఉదయం జరిగే చక్రస్నానంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.

High court Division bench latest orders on tirumala Devotees petition of Seva Tickets

కోవిడ్-19 సమయంలో ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ప్రస్తుతం అవకాశం కల్పించాలని హై కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఆ సమయంలో ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకున్న మిగిలిన భక్తులకు కల్పించిన సదుపాయలనే ఉపయోగించుకోవాలని పిటిషనర్లను ఆదేశించింది.

హైకోర్టు కీలక సూచనలు: కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ భక్తులకు శ్రీవారి దర్శనం రద్దు చేసింది. ఇందులో భాగంగా మేల్ చాట్ వస్త్రం, అభిషేకం సహా ఇతర ఆర్జిత సేవలను కూడా రద్దు చేసింది. ఆర్జిత సేవ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న భక్తులు టికెట్ సొమ్ము వెనక్కు తీసుకోవడమో, లేదా టీటీడీ కల్పించే దర్శనం సదుపాయం ఉపయోగించుకునే వీలు కల్పించింది.

ఈ రకంగా సుమారు 16 వేల మంది భక్తులు ఆర్జిత సేవలో పాల్గొనలేక పోయారు. కొందరు టీటీడీ కల్పించిన దర్శనం చేసుకోగా, మరి కొందరు ఆర్జిత సేవ టికెట్ మొత్తం వెనక్కు తీసుకున్నారు. అయితే 16 మంది భక్తులు తమకు ఆర్జిత సేవలో పాల్గొనేలా టీటీడీ ని ఆదేశించాలని హై కోర్టు ను ఆశ్రయించారు.

High court Division bench latest orders on tirumala Devotees petition of Seva Tickets

టీటీడీ సదుపాయాలు ఉపయోగించుకోండి: కోవిడ్ 19 ప్రమాదం ముగిసినందువల్ల పిటిషనర్లకు వారు బుక్ చేసుకున్న ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. దీనిపై టీటీడీ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. భక్తులు దశాబ్దాలకు ముందే ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకున్నందువల్ల పిటిషనర్లకు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించలేమని టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ డివిజన్ బెంచ్ కు వివరించారు. ఈ వివరణతో ఏకీభవించిన న్యాయమూర్తులు టీటీడీ ఇచ్చిన రెండు సదుపాయాల్లో ఏదో ఒకటి ఉపయోగించుకోవాలని పిటిషనర్లకు సూచించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టి వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+