వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎస్పీ రవిబాబు: గేదేల రాజుకు ఆ డబ్బెలా వచ్చింది?

విశాఖపట్టణంలో సంచలనం రేపిన రౌడీషీటర్ గేదేల రాజు హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది.ఈ కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న డిఎస్పీ రవిబాబును విచారించిన తర్వాత పద్మలత మృతి కేసుకు సంబంధించి ఎస్‌స

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: విశాఖపట్టణంలో సంచలనం రేపిన రౌడీషీటర్ గేదేల రాజు హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది.ఈ కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న డిఎస్పీ రవిబాబును విచారించిన తర్వాత పద్మలత మృతి కేసుకు సంబంధించి ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసును నమోదు చేశారు.

రౌడీషీటర్ గేదేల రాజు హత్యకేసులో డీఎస్పీ రవిబాబుతో పాటు ఎ1 నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు.గేదేల రాజు హత్యకు మాజీ ఎంపీపీ పద్మలత హత్య కేసుతో సంబంధాలు ఉన్నాయనే తేలింది.

పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు తన కుమార్తె పద్మలతను రవిబాబు, ఎ-2 నిందితుడు భూపతిరాజు శ్రీనివాసరాజు, గేదెల రాజు హత్యచేశారని ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఐపీసీ 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అనుబంధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయించారు.

గేదేల రాజు హత్యతో పద్మలతది హత్యగా తేలింది

గేదేల రాజు హత్యతో పద్మలతది హత్యగా తేలింది

విశాఖ పట్టణానికి చెందిన రౌడీషీటర్ గేదేల రాజు హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. మాజీ ఎంపిపి పద్మలత హత్య కేసుతో సంబంధం ఉన్నందున గేదేల రాజును హత్య చేశారని పోలీసులు గుర్తించారు.గేదెల రాజు హత్య కేసును న్యూపోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పద్మలత కేసు విచారణ బాధ్యతను గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రవిబాబుతో రాజీ చేస్తానని చెప్పి

రవిబాబుతో రాజీ చేస్తానని చెప్పి

గేదెల రాజు తమ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ పద్మలతను మచ్చిక చేసుకుని గత ఏడాది ఆగస్టులో గాజువాకలోని తన ఇంటికి తీసుకెళ్లాడని గేదేల రాజు పై పద్మలత తండ్రి నూకరాజు ఆరోపించారు.రవిబాబుతో రాజీ కుదురుస్తానంటూ తిప్పించుకుని విష ప్రయోగం చేసి హతమార్చాడని తండ్రి కాకర్ల ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు లోతుపాతులపై దర్యాప్తు మొదలు పెట్టారు.పద్మలత గేదెల రాజు ఇంట్లో ఉంటూ కుటుంబ సభ్యురాలిగా కలిసిపోయిందని నూకరాజు చెప్పారు.

వారెందుకు గేదేల రాజుకు డబ్బులిచ్చారు?

వారెందుకు గేదేల రాజుకు డబ్బులిచ్చారు?

సెప్టెంబరు 22న పద్మలత అనుమానాస్పదంగా మృతిచెందాక డీఎస్పీ రవిబాబు గాజువాకకు చెందిన ఓ బార్‌ నిర్వహకుడు, పెట్రోల్‌బంకు నిర్వాహకుడు కలిసి గేదెల రాజుకు రూ.20లక్షల నగదు ఇచ్చారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంతెన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

భూపతి రాజు శ్రీనివాసరాజు అరెస్టైతే మరింత సమాచారం

భూపతి రాజు శ్రీనివాసరాజు అరెస్టైతే మరింత సమాచారం

గేదేల రాజు హత్య కేసులో నిందితుడిగా ఉన్న క్షత్రియ భేరి పత్రిక నిర్వహకుడు భూపతిరాజు శ్రీనివాసరాజును ఇంకా పోలీసులు అరెస్టు చేయలేదు. ఇప్పటికీ తమ అదుపులో లేడని చెబుతున్నారు. భూపతిరాజు శ్రీనివాసరాజును అరెస్ట్ చేస్తే ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనని అంతా ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు.

English summary
Dasari Ravi Babu, Dy. SP and prime accused in the murder of rowdy-sheeter K. Satyanarayana Raju alias Gedela Raju, has confessed to his crime and said he had paid ₹10 lakh to Bhupathiraju Srinivasa Raju (A2), to avoid harassment for money, according to the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X