నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోరం: కూతురిపై పెంపుడు తండ్రి అత్యాచారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Girl raped his wife's daughter in Nellore district
నెల్లూరు: పెంపుడు తండ్రి తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం బురదమడుగులో శుక్రవారం ఈ ఘటనపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. ఓజిలి మండలం మానవాలికి చెందిన మహిళకు నాయుడుపేటవాసితో వివాహమైంది.

అయితే, ఏడాదిగా ఆ మహిళ ధనిగ రవితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇది తెలిసి ఆమెను భర్త ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. తొమ్మిదేళ్ల కుమార్తెతో ఆ మహిళను రవి రెండో భార్యగా స్వీకరించి బురదమడుగులో కాపురం పెట్టాడు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మహిళను పనిమీద బయటకు పంపిన రవి నిద్రిస్తున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

తల్లిని, కుమార్తెను ఇంట్లోనే నిర్బంధించాడు. శుక్రవారం సాయంత్రం గ్రామస్థుల ద్వారా విషయం బయటకు పొక్కడంతో పోలీసులు నిందితుడు రవిని పట్టుకున్నారు. సీఐ అక్కేశ్వరరావు విచారణ చేపట్టి, బాలికను ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

కాలువలోకి దూసుకెళ్లిన కారు

సూళ్లూరుపేట పట్టణంలోని హోలిక్రాస్ సమీపంలో నెర్రికాల్వవలోకి ఓ కారు దూసుకెళ్లిన సంఘటన శుక్రవారం చోటుచేసుకొంది. శ్రీహరికోట వైపు అతివేగంగా వెళ్తున్న కారు హోలిక్రాస్ కూడలి సమీపంలో సాయినగర్ వద్ద అదుపుతప్పి నెర్రి కాల్వవలోకి దూసుకెళ్లి నీళ్లలో పడిపోయింది. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో అక్కడున్న వారందరూ అరుపులు కేకలు పెడుతూ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

కారులో ఉన్న డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం క్రేన్ తెప్పించి కాలువలో నుంచి కారును బయటకు తీశారు.

English summary
A man sexually assaulted aaginst his wife's daughter in Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X