2019లో వెంకటగిరి నుండి పోటీ చేస్తా, ఏ పార్టీ నుండో తెలుసా?: నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి
నెల్లూరు: 2019 ఎన్నికల్లో వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు రాంకుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాననే విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు.
త్వరలోనే కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకొంటానని ఆయన ప్రకటించారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని రెండు నెలల్లో ప్రకటించనున్నట్టు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో రాంకుమార్ రెడ్డి ఉండేవాడు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలపై ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరారు.
అయితే బిజెపిలో కూడ అంతగా క్రియాశీలకంగా రాంకుమార్ రెడ్డి లేరు.ఎన్నికలు దగ్గరపడుతున్నందున త్వరలోనే ఆయన ఏదో ఒక పార్టీలో చేరాలనే యోచనలో ఉన్నారు. అయితే రాంకుమార్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications