నందమూరి తారకరత్నకు నేడు మరోమారు కీలక వైద్యపరీక్షలు.. తర్వాతే స్పష్టత; అందరిలో టెన్షన్!!

నందమూరి తారక రత్న ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతూనే ఉంది. నందమూరి తారకరత్నకు నేడు మరోమారు కీలక పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాతే ఆయన ఆరోగ్యం పై స్పష్టత రానుంది. అయితే వైద్యులు ప్రధానంగా ఈ అంశాలపైనే ఫోకస్ చేస్తున్నారు.

నందమూరి తారక రత్న ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతూనే ఉంది. అటు నందమూరి కుటుంబంలోనూ, తెలుగుదేశం పార్టీలోనూ నందమూరి తారక రత్న ఆరోగ్యంపై విపరీతమైన టెన్షన్ కనిపిస్తుంది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువ గళం పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయాలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు వైద్యులు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కొనసాగుతున్నప్పటికీ గతంతో పోలిస్తే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం కాస్త నిలకడగానే ఉందని, కొంత మార్పు కనిపించిందని చెప్తున్నారు. అయితే నేడు నిర్వహించనున్న పరీక్షలతో ఆయన ఆరోగ్యంపై మరింత క్లారిటీ రానుంది.

నేడు తారక రత్నకు కీలక పరీక్షలు

నేడు తారక రత్నకు కీలక పరీక్షలు


అయితే నేడు తారకరత్నకు మరిన్ని కీలక వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. నేడు నిమ్స్ నుంచి మరోమారు వైద్యులు నారాయణ హృదయాలయ కు వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై పరీక్షలు చేయనున్నారు. అనంతరం నేడు ఆయన ఆరోగ్యం పై వైద్యులు బులిటెన్ విడుదల చేయనున్నారని సమాచారం. బ్రెయిన్ డెడ్ రికవరీ పై ఫోకస్ పెట్టిన వైద్యులు ఎంత మేరకు బ్రెయిన్ డేట్ ను రికవరీ చేయగలిగామన్న దానిపైన పరీక్షలు నిర్వహించనున్నారు. నేటి పరీక్షలు కీలకం కావడంతో, పరీక్షల అనంతరం హెల్త్ బులిటెన్ విడుదల చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి పై క్లారిటీ ఇవ్వనున్నారు.

నారాయణ హృదయాలయ లో కొనసాగుతున్న టెన్షన్

నారాయణ హృదయాలయ లో కొనసాగుతున్న టెన్షన్

ప్రస్తుతం తారకరత్న శరీరం చికిత్సకు స్పందిస్తున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. అయితే ఆందోళనకర పరిస్థితి నుంచి ఇంకా తారకరత్న బయటపడలేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తాజాగా నారాయణ హృదయాలయ లో కొనసాగుతున్న టెన్షన్ స్పష్టంగా చెబుతుంది. ఇప్పటికే తారకరత్న కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బాలకృష్ణ ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు.

తారక రత్న త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్

తారక రత్న త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్

తారకరత్న పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్న తర్వాత మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న పోరాటం చేస్తున్నారన్నారు. నిన్నటి మీద ఈరోజు తారకరత్న స్పందిస్తున్నారు.. ఎక్మో మీద లేరు కానీ క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నారు అంటూ పేర్కొన్నారు. అభిమానుల ఆశీస్సులు..తాత ఆశీస్సులతో కోలుకుంటారని ఆశిస్తున్నాను, తిరిగి మనతో తారకరత్న గతంలో లాగానే ఉంటారని భావిస్తున్నాను అంటూ తారకరత్న త్వరగా కోలుకుంటారని జూనియర్ ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వైద్య పరీక్షల తర్వాతే తారకరత్న ఆరోగ్యంపై క్లారిటీ

వైద్య పరీక్షల తర్వాతే తారకరత్న ఆరోగ్యంపై క్లారిటీ

నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో కుప్పకూలిన తారకరత్నను కేసి ఆసుపత్రికి తరలించి, అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పిఈసి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ అక్కడికి చేరుకుని డాక్టర్లతో మాట్లాడి కుప్పం ఆస్పత్రి డాక్టర్ల సలహా మేరకు తారకరత్నను ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. నారాయణ హృదయాలయలో ప్రస్తుతం తారకరత్నకు వైద్య చికిత్స కొనసాగుతోంది. ముందు ఎక్మోపై వైద్యం అందించారని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం వెంటిలేటర్ పైన వైద్యం అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈరోజు తారకరత్నకు నిర్వహించబోయే పరీక్షలు కీలక పరీక్షలు కావడంతో, అనంతరం వైద్యులు తదుపరి చికిత్సకు సంబంధించిన క్లారిటీ ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+