ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు భారీ షాక్..!
మరో 14 రోజుల్లో ఎన్నికలకు సిద్దమవుతున్న ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై పలు వివాదాలు, విమర్శల పర్వ నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రంలోఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ లో కేసు దాఖలు కావడంతో స్పందించి ఆదేశాలు చేసింది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు స్పందించింది.
రాష్ట్రంలో అనుమతుల్లేకుండా భారీగా చేపడుతున్న ఇసుక తవ్వకాల కారణంగా పర్యావరణానికి హాని కలుగుతోందంటూ పలువురు గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ))ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ అలాంటి తవ్వకాలను వెంటనే నిలివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఎన్జీటీ ఆదేశాల తర్వాత కూడా తవ్వకాలు జరుగుతుండటంతో కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ క్రమంలో సుప్రీంకోర్టులో దాఖలైన అక్రమ ఇసుక తవ్వకాల కేసుపై ఇవాళ విచారణ జరిగింది. అనంతరం సుప్రీంకోర్టు.. రాష్ఠ్రంలో అక్రమంగా సాగుతున్న అన్ని ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించింది. అలాగే అక్రమ ఇసుక తవ్వకాల నిలిపివేతపై నివేదికతో మే 9వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సూచించింది.
దీంతో పాటు ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎన్జీటిని కూడా సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. గతంలో ఎన్జీటీ ఆదేశాల తర్వాత అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ ఇవ్వాలని స్ధానిక కాంట్రాక్టర్ అయిన జేపీ వెంచర్స్‌కు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేని చోట ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. అనుమతులు ఉన్న చోట మ్యానువల్‌గా మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications