ఏపీ కొత్త ఓటర్లు వారి వైపే, డిసైడింగ్ ఫ్యాక్టర్ - అక్కడే అసలు ట్విస్ట్..!!
ఏపీలో ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరింది. ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అర్బన్, గ్రామీణ వారీగా ఓటర్లు..పార్టీలకు పోలయ్యే ఓట్ల గురించి చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే తొలి సారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత ఓటింగ్ కీలకంగా మారుతోంది. ఏపీలో దాదాపు 10.3 లక్షల మంది తొలి సారి ఓటు వేస్తున్నారు. వీరి మద్దతు ఎవరికి. ఇదే ఎన్నికల్లో గెలుపు ఓటముల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
మద్దతు ఎవరికి
ఏపీలో ఓటర్లను పలు కేటగిరీల వారీగా లెక్కలు వేస్తున్నారు. ఎవరి మద్దతు ఎవరికి దక్కుతుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. పట్టణ ప్రాంతంలో కొంత బలహీనంగా ఉన్న వైసీపీ గ్రామీణ ప్రాంతంలో కూటమి కంటే బలంగా ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. అదే విధంగా పురుషులు కంటే మహిళల్లో వైసీపీ వైపు ఆదరణ ఎక్కువగా కనిపిస్తుందనే చర్చ వినిపిస్తోంది. సంక్షేమ పథకాల కేంద్రంగా ఓట్ బ్యాంకులు ఖరారవుతున్నాయి. ఇదే సమయంలో పథకాలు అందని వారు, వాటిని వ్యతిరేకిస్తున్న వారు జగన్ కు వ్యతిరేకంగా ఓటింగ్ చేస్తారని చెబుతున్నారు. పథకాల లబ్దిదారులు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో యువత మద్దతు ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది.

భిన్న అంచనాలు
ఏపీలో ఈ సారి దాదాపు 10.3 లక్షల మంది యువత తొలి సారి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్న వారు, ఏపీలో ఓటు హక్కు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఉన్నారు. ఓటు సమయానికి వీరిలో మెజార్టీ ఓటర్లు ఓటు వేసేందుకు తమ స్వస్థలాలకు వచ్చేందుకు సిద్దమవుతున్నారు. దీంతో..పెద్ద సంఖ్యలో ఉన్న వీరి మద్దతు ఎవరికి అనే చర్చ మొదలైంది. ఇతర రాష్ట్రాల్లోనే ఉంటూ వారు తమ మద్దతు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు. తొలి సారి ఓటు వేస్తున్న వారు కేంద్రంలో మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు సర్వేలు వెల్లడించాయి. అయితే, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాత్రం భిన్నమైన అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

గెలుపులో కీలకం
యువత మద్దతు తమ మూడు పార్టీల కూటమికే ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాజధాని, ఆర్దిక పరిస్థితులు, ఉపాధి కల్పన వంటికి కీలకంగా ఉంటాయని విశ్లేషిస్తున్నారు. పవన్ కు యువతలో అభిమానం ఎక్కువగా ఉండటం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత తమ కుటుంబాలకు జగన్ పథకాల ద్వారా జరుగుతున్న మేలు పట్ల ఆకర్షితులయ్యారనేది మరో వాదన. అదే సమయంలో ప్రధానంగా విద్యా సంస్కరణలు, వైద్య సేవలు, పోర్టులు, గ్రామాల్లో వచ్చిన మార్పులతో వైసీపీకి మద్దతిస్తారని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఏపీలో ఉన్న ఓట్ బ్యాంకుల తరహాలోనే వారిలోనూ కూటమి - వైసీపీకి మద్దతు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలతో యువత ఓటింగ్ కీలకం కానుండటంతో..మెజార్టీ మద్దతు ఎవరికి దక్కుతుందనేది కీలకంగా మారుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications