ఏపీలోని ఈ జిల్లాలకు హైఅలర్ట్ జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

కృష్ణానది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండింది. అధికారులు గేట్లను ఎత్తారు. వరద నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు. అటు నాగార్జున సాగర్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవలే సాగర్ గేట్లన్నింటినీ ఎత్తారు అధికారులు.

In the wake of heavy rainfall the Krishna Godavari and Tungabhadra rivers are flowing fiercely

దీని ప్రభావం ప్రకాశం బ్యరేజీపై పడింది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.92 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. వచ్చిన వరద నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తోన్నారు. అటు గోదావరి సైతం ఉరకలు వేస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.2 అడుగులు.

ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజి వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.38 లక్షల క్యూసెక్కులు ఉంటోంది. ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. సహాయక కార్యకలాపాలకు 16 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపింది.

రక్షణ చర్యల కోం రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు సిద్ధం అయ్యాయి. కృష్ణా, గోదావరి నదిపరీవాహక ప్రాంతాలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఎగువ కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపధ్యంలో స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వరదలపై కలెక్టర్లకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు.

ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సహాయ కార్యకలాపాలు కోసం ప్రభావిత జిల్లాలకు టీఆర్-27 క్రింద 16 జిల్లాలకు 16 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. సహాయక చర్యలు కోసం కృష్ణా జిల్లా - అవనిగడ్డ, ఎన్టీఆర్ జిల్లా- విజయవాడ, కృష్ణా ఘాట్, అల్లూరి జిల్లా చింతూరు, కోనసీమ-అమలాపురంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

మరింత వరద పెరిగే అవకాశం ఉందని, ఎట్టిపరిస్థితుల్లోనూ పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+