అసెంబ్లీ లాబీల్లో పేర్నినాని, పయ్యావుల కేశవ్ మధ్య ఆసక్తికర సంభాషణ...!
ఏపీ అసెంబ్లీలో ఉప్పూ, నిప్పుగా కనిపించే ఇద్దరు వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో మాత్రం ఇవాళ ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.
అమరావతి : ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (ap assembly budget sessions) ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇందులో ఉదయం గవర్నర్ ప్రసంగం చేశారు. అనంతరం బీఏసీ సమావేసం జరిగింది. ఇందులో అసెంబ్లీ 9 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. బీఏసీ జరుగుతున్న సమయంలోనే ఓ వైసీపీ, మరో టీడీపీ ఎమ్మెల్యే పరస్పరం ఎదురుపడ్డారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నినాని(perni nani), అలాగే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (payyavula keshav) ఎదురయ్యారు. దీంతో వీరిద్దరూ పరస్పరం పలకరించుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై ఇద్దరూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నవ్వుతూనే ఇద్దరూ పరస్పరం కౌంటర్లు కూడా వేసుకున్నారు.

ముందుగా పేర్ని నాని, పయ్యావుల కేశవ్ ఇద్దరూ ఎలా ఉన్నారని పలకరించుకున్నారు. అనంతరం పేర్నినాని.. మళ్లీ కేశవ్ గెలవాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదన్న సెంటిమెంటును గుర్తు చేస్తూ పేర్ని నాని ఈ వ్యాఖ్య చేశారు. నో డౌట్ 1994 ఫలితాలు 2024లోనూ రిపీట్ అవుతాయని పయ్యావుల కేశవ్ అంతే దీటుగా జవాబిచ్చారు. అయితే పేర్నినాని కేశవ్ గెలవాలని ఎందుకు కోరుకున్నారు, దానికి 1994 రిపీట్ అవుద్దని కేశవ్ ఎందుకు చెప్పారనే చర్చ జరుగుతోంది. దీని వెనుక రెండు కీలక కారణాలున్నాయి.
ముందుగా పయ్యావుల కేశవ్ గెలవాలని పేర్ని ఎందుకు కోరుకున్నారంటే.. ఆయన నియోజకవర్గం ఉరవకొండలో గెలిచే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్నిఏర్పాటు చేయలేదనే సెంటిమెంట్ ఉంది. అయితే దీనికి సమాధానంగా పయ్యావుల 1994 రిపీట్ అవుతుందని ఎందుకుచెప్పారంటే..ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఉరవకొండలో గెలిచిన టీడీపీ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. దీంతో అది రిపీట్ అవుతుందని పరోక్షంగా నానికి కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications