irctc అద్భుత ప్యాకేజ్

వేసవి సెలవులు వచ్చాయంటే.. ఎక్కడికి వెళదాం?.. ఏయే ప్రాంతాలు చూసొద్దాం? లాంటి ఆలోచనలతో మది నిండిపోతుంది. ఇంకా ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేయనివారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్. మే 26వ తేదీన అందుబాటులో ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్, రాస్, నార్త్ బే ఐల్యాండ్, హేవ్‌లాక్ ఐల్యాండ్, నీల్ ఐల్యాండ్ కవరవుతాయి. అమేజింగ్ అండమాన్ పేరుతో ఐఆర్ సీటీసీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్ ప్యాకేజీ ఇలా ..
మొదటిరోజు: హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఉదయం 6.35 గంటలకు హైదరాబాద్‌లో విమానం ఎక్కితే 9.15 గంటలకు పోర్ట్‌బ్లెయిర్ చేరుకుంటారు. హోటల్ లో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సెల్యులార్ జైలు మ్యూజియం సందర్శన ఉంటుంది. అక్కడి నుంచి కార్బిన్స్ కోవ్ బీచ్‌కు తీసుకెళ్తారు. సాయంత్రం సెల్యులార్ జైలులో లైట్ అండ్ సౌండ్ షో చూస్తారు. ఆరోజు రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస.

 irctc-

రెండోరోజు: రెండో రోజు హేవ్‌లాక్ ఐల్యాండ్ క్రూజ్‌ ట్రిప్ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాధానగర్ బీచ్ సందర్శన. రాత్రికి హేవ్‌లాక్‌లో బస.

మూడోరోజు: మూడో రోజు కాలాపత్తర్ బీచ్‌కు తీసుకువెళతారు. అక్కడి నుంచి నీల్ ఐల్యాండ్‌ సందర్శన. హోటల్‌కి వచ్చిన తర్వాత లక్ష్మణ్‌పూర్ బీచ్‌కు వెళ్లి సూర్యాస్తమయాన్ని చూడొచ్చు.

నాలుగోరోజు: నాలుగో రోజు హోటల్ నుంచి బయటకు వచ్చి భరత్‌నగర్ బీచ్‌కు వెళతారు. సొంత ఖర్చులతో స్విమ్మింగ్, గ్లాస్ బాటమ్ బోట్ రైడ్, వాటర్ స్పోర్ట్స్, ఇతర యాక్టివిటీస్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడి నుంచి పోర్ట్ బ్లెయిర్ తీసుకెళ్తారు. సాయంత్రం సమయం ఖాళీ. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస.

ఐదోరోజు: ఐదో రోజు రాస్ ఐల్యాండ్‌కు, అక్కడి నుంచి నార్త్ బే ఐల్యాండ్ సందర్శన ఉంటుంది. సొంత ఖర్చులతో వాటర్ స్పోర్ట్స్, ఇతర యాక్టివిటీస్ లో పాల్గొనవచ్చు. తిరిగి పోర్ట్‌బ్లెయిర్ వెళ్లిన తర్వాత సముద్రిక మెరైన్ మ్యూజియం సందర్శన, సాయంత్రం షాపింగ్ కోసం ఖాళీ సమయం.

ఆరోరోజు: ఆరో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఉదయం 9.55 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌లో విమానం ఎక్కితే మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడితో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర
ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్ ప్యాకేజీ ధర ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ధర రూ.42,885, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.43,170, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.55,780 చెల్లించాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీలో విమానం టికెట్లు, ఏసీ హోటల్‌లో బస, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, నీల్ ఐల్యాండ్, హేవ్‌లాక్ ఐల్యాండ్, రాస్ ఐల్యాండ్, నార్త్ బే ఐల్యాండ్‌కు పడవ ఛార్జీలు, ఉదయం టిఫిన్, రాత్రి భోజనం ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+