ప్రత్యేక హోదా రాదని జగన్ కు ముందే తెలుసు .. అయినా సరే... జయప్రకాశ్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు

Recommended Video

    ప్రత్యేక హోదా రాదన్న విషయం జగన్ కి ముందే తెలుసు| Jagan Know That BJP Will Not Give Special Status:Jp

    ఏపీ ప్రత్యేక హోదా విషయంలో లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదనే విషయం మొదటి నుండి అన్ని రాజకీయ పార్టీలకు తెలుసని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా, అధికారం లేనప్పుడు మరో విధంగా మాట్లాడడం రాజకీయ నాయకులకు అలవాటైపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

    ప్రత్యక హోదా ఇస్తామని మాట తప్పి ఏపీలో పట్టు కోల్పోయిన బీజేపీ

    ప్రత్యక హోదా ఇస్తామని మాట తప్పి ఏపీలో పట్టు కోల్పోయిన బీజేపీ

    ఏపీకి ప్రత్యేక హోదా... విభజన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రజలు బలంగా కోరుకుంటున్న అంశం. 2014 ఎన్నికలు జరగకముందే ఆంధ్ర రాష్ట్ర స్థితిగతుల రీత్యా రాష్ట్రానికి తాము కనుక అధికారంలోకి వచ్చినట్టయితే పదిహేనేళ్ళు ప్రత్యేకహోదా ఇచ్చి రాష్ట్ర రూపు రేఖలు మారుస్తామని మోడీ సర్కార్ మాట ఇచ్చింది. అందువల్లనే అప్పుడు టీడీపీ మరియు జనసేనలు బీజేపీకి మద్దతు ప్రకటించాయి.కానీ మోడీ సర్కార్ గెలుపొందిన తర్వాత ఇచ్చిన మాట తప్పి ఆంధ్ర ప్రజలను మోసం చేసారు. దాని ఫలితంగా ఏపీలో బీజేపీ పట్టు కోల్పోయింది.

    ప్రత్యేక హోదా నినాదంతో ప్రజల్లోకి వెళ్ళిన రాజకీయ పార్టీలు

    ప్రత్యేక హోదా నినాదంతో ప్రజల్లోకి వెళ్ళిన రాజకీయ పార్టీలు

    ఏపీలో ప్రత్యేక హోదా కోసం ప్రజల వైపు నుండి బలమైన కాంక్ష వినిపించడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా నినాదం అందుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పని చేస్తామని జగన్ పార్టీ ప్రధానంగా ప్రచారం నిర్వహించింది. ఇక ప్రజల ఆకాంక్ష మేరకు నాడు బీజేపీతో దోస్తానా చేసిన టిడిపి బీజేపీతో దోస్తీ కటీఫ్ అంది. ఆ తర్వాత ప్రత్యేక హోదా సాధన కోసం బీజేపీ పై పోరాటం ప్రారంభించింది. దాని ప్రభావంతో రాష్ట్ర ప్రయోజనాలు చాలావరకు దెబ్బతిన్నాయి. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సహకరించడం మానేసింది. ఇక ఈ సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది భావించిన ప్రజలు గత ఎన్నికల్లో వైసిపికి పట్టం కట్టాయి. కానీ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అతీగతీ లేదు . ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి పారేసింది.

    ప్రత్యేక హోదా రాదని జగన్ కు ముందే తెలుసు .. జగన్ చెప్పేవి కుంటిసాకులు

    ప్రత్యేక హోదా రాదని జగన్ కు ముందే తెలుసు .. జగన్ చెప్పేవి కుంటిసాకులు

    వైసిపి అధినేత జగన్ కు అధికారంలోకి రాకముందే ప్రత్యేక హోదా రాదు అన్న విషయం స్పష్టంగా తెలుసని, కేవలం రాజకీయం కోసమే వైసిపి కానీ, ఇటు టిడిపి కానీ ప్రత్యేక హోదా సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారని లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు బిజెపి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిందని, బిజెపికి స్పష్టమైన మెజారిటీ వచ్చింది కాబట్టే ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి చేయడం సాధ్యం కావడం లేదని జగన్ చేసిన వ్యాఖ్య కేవలం ఓ కుంటి సాకు అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలతో రాజకీయం చేయడం మొదటి నుంచి రాజకీయ పార్టీలకు అలవాటైందని ఆయన వ్యాఖ్యానించారు.

    పెండింగ్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ... రాజకీయం మాత్రమే చేస్తున్న రాజకీయ పార్టీలు

    పెండింగ్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ... రాజకీయం మాత్రమే చేస్తున్న రాజకీయ పార్టీలు

    విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన బోలెడు నిధులు పెండింగ్లో ఉన్నాయని, కనీసం వాటిని సాధించే దిశగా నైనా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. కేంద్రంతో ముందుగా సామరస్యపూర్వక చర్చలు జరపడం, సాధ్యం కాకుంటే చట్టపరమైన చర్యలకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ కి గత ప్రభుత్వం లోనూ, ప్రస్తుత ప్రభుత్వం లోనూ స్పష్టమైన మెజారిటీ ఉందని పేర్కొన్న జయప్రకాశ్ నారాయణ .. అప్పుడు ఇప్పుడు కేంద్రంలో ఓకే పరిస్థితి ఉందని, కాకుంటే రాష్ట్రంలోనే ప్రతిపక్షంలో ఉన్న వైసిపి అధికార పక్షంలోకి వెళ్లిందని అప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాజకీయ పార్టీలు రాజకీయం మాత్రమే చేస్తున్నాయని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+