వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఏపీ అంధకార పథకం: ఫ్యాన్ కు ఓటేస్తే విసనకర్రలు బ్లాక్ లో; ఏపీ కరెంట్ కోతలపై టీడీపీ రచ్చ షురూ !!

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బొగ్గు సంక్షోభంతో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం బొగ్గు కొరత కారణంగా డిమాండ్ కు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తీవ్రమవుతున్న బొగ్గు సంక్షోభాన్ని, విద్యుత్ కొరత సమస్యను పరిష్కరించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇక రాష్ట్రంలో బొగ్గు నిల్వలు లేకపోవటంతో చేసేదేమీలేక కరెంట్ కోతలను విధిస్తుంది ఏపీ సర్కార్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతల వ్యవహారం తెలుగుదేశం పార్టీకి అధికార వైసీపీని టార్గెట్ చేయడానికి అస్త్రంగా మారింది.

ఫ్యాన్ కు ఓటేసినందుకు విసనకర్రలు

సోషల్ మీడియా వేదికగా కరెంట్ కోతలపై పెద్దఎత్తున ప్రచారం మొదలు పెట్టిన తెలుగుదేశం పార్టీ సీఎం జగన్ చేతగాని తనం వల్లే కరెంటు కష్టాలు వచ్చాయని ఆరోపిస్తోంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో ఎలాంటి కరెంటు సమస్య లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు కరెంటు సమస్యగా ఉందని జగన్ ను టార్గెట్ చేస్తోంది .

ఫ్యాన్ కు ఓటేసినందుకు కరెంటు కోతలతో అదనంగా ఇప్పుడు విసనకర్రలు కూడా బ్లాక్ లో అమ్మి మీ రుణం తీర్చుకుంటాడు జగన్ రెడ్డి అంటూ జగన్ ఏపీ డార్క్ నెస్ స్కీమ్ ప్రారంభించారని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తెలుగుదేశం పార్టీ హయాంలో యూనిట్ విద్యుత్ రూ. 4.50 పైసలకి కొన్నామని, ఇప్పుడు యూనిట్ విద్యుత్ 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు పెట్టి కొంటున్నాం అని అదనంగా చెల్లిస్తున్న డబ్బు ఎవరి జేబుల్లోకి వెళుతోందో ? మీకు అర్థం అవుతుందా అంటూ ప్రచారం మొదలుపెట్టింది టీడీపీ .

తెలంగాణా నుండి ఏపీ జెన్ కో బకాయిలు వసూలు చెయ్యని జగన్ రెడ్డి తీరు వల్లే కరెంట్ కష్టాలు


ఏపీ జెన్కో కు 6 వేల కోట్ల సబ్సిడీ చెల్లించని జగన్ సర్కార్, తెలంగాణ ఏపీ జెన్కో కి బకాయి ఉన్న ఆరువేల కోట్ల బకాయిలు తెచ్చుకుంటామంటే అది కూడా వద్దంటున్నాడు అంటూ తెలుగుదేశం పార్టీ పేర్కొంది. ఇదే అదునుగా చూసి ఏపీ జెన్కో ప్రజలను బాదుతోందని అది మీకు అర్థమవుతుందా అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు ఏం కష్టం వచ్చినా, రాష్ట్రానికి ఏం నష్టం వచ్చినా, దాని వెనుక జగన్ రెడ్డి అవినీతి, అసమర్థత తప్పకుండా ఉంటాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.

జగన్ రెడ్డికి సొంత లాభం తప్ప ఇంకేమీ తెలియదని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలకు కారణం జగన్ రెడ్డి అంటూ టీడీపీ ధ్వజమెత్తింది. కేంద్రం విద్యుత్ కొరత లేదంటే రాష్ట్రం తీవ్ర సంక్షోభం అంటోందని ఆరోపిస్తుంది.

నాడు టీడీపీ హయాంలో మిగులు విద్యుత్ .. ఇప్పుడు వైసీపీ హయాంలో లోటు విద్యుత్

2014లో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉన్న ఏపీని నాడు చంద్రబాబు 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచి మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దారని, కానీ నేడు జగన్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి, కమీషన్ల కోసం బయట కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తోంది టిడిపి. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని ఆరోపించింది.

ఏపీ విద్యుత్ మంత్రికి మెగావాట్ అంటే ఏంటో తెలియదని, జగన్ రెడ్డికి స్వలాభం తప్ప ఇంకేమీ తెలియదని, ఇక పెరిగిన కరెంట్ బిల్లులను మౌనంగా కట్టడం తప్ప ఏపీ ప్రజలకు ఇదేమిటని ప్రశ్నించడం తెలియదని టిడిపి చెబుతోంది. ఒకపక్క కరెంటు కోతలు విధిస్తూ, మరోపక్క బిల్లుల మోత తో ప్రజలను కుదేలు చేస్తున్నారని టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

జగన్ మోహన్ రెడ్డి ఏపీ అంధకార పథకాన్ని ప్రారంభించారు

సిక్కింలో ఎధేనా సంస్థ నుంచి విద్యుత్ ను కొనడానికి జగన్ ఎందుకు తహతహలాడుతున్నాడు ? ఏధేనా సంస్థ తీస్తా ఊర్జా విద్యుత్ ప్లాంట్ ను దక్కించుకోవడం వెనుక వైయస్ పాత్ర ఏంటి? దానికి ఇప్పుడు ఏపీలో జెన్కో నష్టాలకు లింకేంటి ? ప్రజలు ఆలోచించాలని టిడిపి చెబుతోంది. జగన్ మోహన్ రెడ్డి ఏపీ అంధకార పథకాన్ని ప్రారంభించాడని టిడిపి దుమ్మెత్తిపోసింది. కావలసినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతుంటే బొగ్గు కొరత ఉందని జగన్ రెడ్డి ఎందుకు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. విద్యుత్ కోతలతో రైతులు సతమతమవుతున్నారని, చంద్రబాబు విద్యుత్ లోటు రాకుండా చూస్తే, ట్రూ అప్ చార్జీల పేరుతో వినియోగదారులపై అదనపు భారం వేయడమే కాకుండా, విద్యుత్ కోతలకు తెరతీసి రాష్ట్ర ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టింది అని టిడిపి విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.

Recommended Video

ఏపీని డ్రగ్స్ మాఫియాగా మార్చిన సీఎం అంటున్న టీడిపి!!
జగన్ చేతివాటం వల్లే రాష్ట్రానికి కరెంట్ కష్టాలు

జగన్ చేతివాటం వల్లే రాష్ట్రానికి కరెంట్ కష్టాలు

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై తప్పంతా జగన్ దేనని, కేవలం కమీషన్ల కోసమే కృత్రిమ విద్యుత్తు కొరతను సృష్టించారని టిడిపి ఆరోపిస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై విరుచుకు పడుతున్న టిడిపి నేతలు నిత్యం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి సీఎం జగన్ చేతివాటం వల్లే రాష్ట్రానికి కరెంటు కష్టాలు వచ్చాయని విమర్శించారు.

రాష్ట్ర ప్రయోజనం వద్దు, కమిషనే ముద్దు అన్న చందంగా జగన్ రెడ్డి పాలసీ ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికి సలహా ఇవ్వమంటే ఆయన ప్రజలకు సలహాలిస్తున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏసీలు ఆపేసి ఫ్యాన్ లను వాడాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ ఎమ్మెల్సీ బీటెక్ రవి పేర్కొన్నారు. టీడీపీ నేతలు పదేపదే విద్యుత్ కోతలకు, విద్యుత్ చార్జీల పెరుగుదలకు జగన్ కారణం అని టార్గె చేస్తున్నారు.

English summary
TDP has launched a massive campaign on social media, has blamed CM Jagan for the power crisis. TDP incensed that CM has launched the Jagan AP Darkness Scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X