పాముకాటుతో మరణించిన విద్యార్ధి కుటుంబానికి జగన్ సర్కార్ అండ; ఆర్ధిక సాయం ప్రకటన
విజయనగరం జిల్లా కురుపాంలో పాము కాటుకు గురై విద్యార్థి మృతి చెందిన ఘటన పై ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కురుపాం లోని బాలుర గురుకుల పాఠశాలలో రాత్రి సమయంలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థులను పాము కాటు వేసింది. వెంటనే కురుపాం ఏరియా ఆసుపత్రికి విద్యార్థులను తరలించిన అప్పటికే ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులను విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

పాము కాటు ఘటనలో మృతుని కుటుంబానికి జగన్ సర్కార్ అండ
ఇక ఈ ఘటనపై స్పందించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మృతి చెందిన విద్యార్థి మంతిన రంజిత్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కుటుంబానికి జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. మంత్రుల ద్వారా ఈరోజు విద్యార్థి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి వెల్లడించారు. దీంతో విద్యార్థి కుటుంబానికి కాస్త ఊరట లభించనుందని భావిస్తున్నారు. అంతేకాదు పాము కాటుతో చికిత్స పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయించాలని జగన్ సూచించారని వెల్లడించారు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు విద్యార్థులు .. తల్లిదండ్రుల ఆవేదన
మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల పాము కాటు ఘటన చోటుచేసుకోవడంతో ఈ ఘటనలో విద్యార్థులు మంతిన రంజిత్ మృతి చెందగా నవీన్, వంశీలు ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థులు పాముకాటుకు గురైన విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నో ఆశలతో పెంచుకుంటున్న తమ పిల్లలు స్కూల్ లో పాము కాటుకు గురవటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో కలిసి చదువుకుంటున్న విద్యార్ధి విగతజీవిగా మారటంతో తోటి విద్యార్థులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్న డిప్యూటీ సీఎం
ఈ ఘటన విషయం తెలిసి హుటాహుటిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.వారికి మెరుగైన చికిత్స చెయ్యాలని సూచించారు. భవిష్యత్ లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని, త్వరలోనే సంక్షేమ వసతి గృహాలపై సమీక్ష నిర్వహించి ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు.
Recommended Video

బాధిత కుటుంబానికి అండగా ఉండాలని మంత్రులకు సూచించిన జగన్
ఇక పాము కాటుకు విద్యార్ధి మృతి చెందిన విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో జగన్ బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందించి అండగా నిలవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications