టీడీపీ నేత పట్టాభికి జగన్ సర్కార్ ఝలక్- ఇసుక లీజుల్లోకి సీఎంవోను లాగడంపై చర్యలు

ఏపీలో ఇసుక లీజుల వ్యవహారం అధికార ప్రతిపక్షాలపైన వైసీపీ, టీడీపీ మధ్య వాగ్యుద్దానికి కారణమవుతోంది. ఇదే క్రమంలో వైసీపీ సర్కార్ లో సీఎంవో నుంచి ఇసుక లీజుల్ని తీసుకున్న సుధాకర్ ఇన్ ఫ్రా అక్రమాలకు పాల్పడుతోందంటూ టీడీపీ నేత పట్టాబి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ప్రభుత్వం ఇవాళ తీవ్రంగా స్పందించింది. నకిలీ సంస్ధ నుంచి తీసుకున్న వివరాలతో ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఏపీ సీఎంవో సిఫార్సుతో సుధాకర్ ఇన్ ప్రా ఇసుక లీజులు పొంది అక్రమాలకు పాల్పడుతోందన్న ఆరోపణల్ని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ కార్యదర్శి ఖండించారు. ఈ మేరకు టీడీపీ నేత పట్టాభి చేసిన ఆరోపణలపై ఆయన వివరణ విడుదల చేశారు. ఏపీలో ఇసుక తవ్వకాల కోసం ప్రభుత్వం జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్ధకు మాత్రమే లీజులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మధ్యలో సుధాకర్ ఇన్ ఫ్రా సబ్ లీజులు పొందినట్లు ప్రచారం చేసుకుంటూ లబ్ది పొందుతోందని, దీనిపై ఆరోపణలు రాగానే తాము విజయవాడ భవానీపురం పీఎస్ లు కేసులు పెట్టినట్లు గోపాల కృష్ణ ద్వివేదీ తెలిపారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా టీడీపీ నేత పట్టాభి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆయన ఆరోపించారు.

jagan government warns action against tdp leader pattabhi for dragging cmo into sand leases issue

సుధాకర్ ఇన్ ఫ్రాకు గోదావరి నదిలో డ్రెడ్జింగ్ కు అనుమతి ఇవ్వాలంటూ సీఎంవో నుంచి తమకు ఎలాంటి సిఫార్సూ రాలేదని ద్వివేదీ తెలిపారు. అయినా తమకు ధన్యవాదాలు చెప్తున్నట్లు సుధాకర్ ఇన్ ప్రా చెప్పుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. సుధాకర్ ఇన్ ఫ్రా ధన్యవాదాల ప్రకటనను పట్టుకుని ప్రభుత్వంపై పట్టాభి చేస్తున్న విమర్శల్ని ద్వివేదీ ఖండించారు. గనుల శాఖ నుంచి తమకు అనుమతి ఉందంటూ సుధాకర్ ఇన్ ఫ్రా ప్రదర్శించిన పేపర్లు కూడా ఫేక్ అని వీటిపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని ద్వివేదీ వెల్లడించారు. నకిలీ అంశాల్ని పట్టుకుని ప్రభుత్వ అధికారుల మానసిక స్ధైర్యం దెబ్బతీసేలా పట్టాభి చేసిన ఆరోపణలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ద్వివేదీ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+