గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులకు జగన్ సర్కార్ యోచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలనే ఉద్దేశ్యంతో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి విలేజ్ వాలంటీర్ల ద్వారా సేవలందిస్తోంది ఏపీ సర్కార్. ఇక తాజాగా ఏపీ లోని గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు చేయాలని సర్కార్ భావిస్తోంది. డ్రాయింగ్ ఆఫీసర్ వ్యవస్థలో మార్పులు చేయడం కోసం ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది .ప్రస్తుతం గ్రామ సచివాలయాలకు పంచాయతీ ఈవో డీడీవోగా వ్యవహరిస్తున్నారు.

అయితే.. పంచాయతీ ఈవో డీ డీ వో గా వ్యవహరిస్తున్న స్థానంలో వీఆర్వో ను డిడివోగా నియమించే ప్రతిపాదనపై ఏపీ సర్కారు దృష్టి పెట్టింది. అయితే వీఆర్వో కు డిడీవో గా బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనను పంచాయితీ రాజ్ ఉద్యోగ సంఘాలు ఒప్పుకునే లాగా కనిపించడం లేదు. ప్రభుత్వం చేస్తున్న ఈ ఆలోచనను పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈవో డీడీవో గా వ్యవహరించిన స్థానంలో వీఆర్వో ను తీసుకొచ్చి కూర్చోబెట్టడం తప్పని వారంటున్నారు.

Jagan govt plans to make key changes in the village secretariat system

అవసరమైతే ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉన్నామని పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి. మరి ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు ఇంతగా వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+